త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | ర‌క్ష‌ణ సేన కాద‌ది.. ‘రాక్ష‌స’ సేన: టీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విమ‌ర్శ‌లు

MLA Anirudh Reddy | క‌విత (Kavitha) కొత్త పార్టీపై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీ (TRS) కాద‌ని.. అది తెలంగాణ రాక్ష‌స సేన పార్టీ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ (BRS) ప‌దేళ్ల పాల‌న‌లో దోచుకున్న‌ది స‌రిపోకే క‌విత మ‌ళ్లీ దోచుకోవ‌డానికే కొత్త‌ పార్టీ పెట్టింద‌ని ఆరోపించారు.

S

News | Published On May 5, 2026, 2.50 pm IST

MLA Anirudh Reddy | ర‌క్ష‌ణ సేన కాద‌ది.. ‘రాక్ష‌స’ సేన: టీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విమ‌ర్శ‌లు
Advertisement
  • టీఆర్ఎస్ పార్టీలో చేరేవాళ్లంతా రాక్ష‌సులే
  • మీ నాయిన సీఎంగా ఉన్న‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌లే
  • ఈరోజు తండ్రి మీద‌నే మాట్లాడే నువ్ రేపు ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్త‌వా?
  • దోచుకోవాడానికే టీఆర్ఎస్‌, బీఆర్ఎస్‌
  • జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

MLA Anirudh Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: క‌విత (Kavitha) కొత్త పార్టీపై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీ (TRS) కాద‌ని.. అది తెలంగాణ రాక్ష‌స సేన పార్టీ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ (BRS) ప‌దేళ్ల పాల‌న‌లో దోచుకున్న‌ది స‌రిపోకే క‌విత మ‌ళ్లీ దోచుకోవ‌డానికే కొత్త‌ పార్టీ పెట్టింద‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌, టీఆర్ఎస్ పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప‌దేండ్లు దోచుకున్న‌వ్ క‌దా?

ఈరోజు ఒక ప‌క్క బీఆర్ఎస్‌, ఇంకోప‌క్క టీఆర్ఎస్ పార్టీ అంట‌. టీఆర్ఎస్ అంటే ఏంట‌ని అక్క‌డే ఉన్న నాయ‌కుల‌ను విమ‌ర్శ‌నాత్మ‌కంగా అడిగారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్ష‌ణ సేన పార్టీ కాదు. రాక్ష‌స సేన పార్టీ. ఈ కొత్త పార్టీ దేనికీ? మీ నాయిన సీఎంగా ఉన్న‌ప్పుడు ప‌దేండ్లు దోచుకున్న‌వ్ క‌దా? మ‌రి ఆరోజు ఎందుకు కొట్లాడ‌లేదు. కాళేశ్వ‌రంల దోచుకుంటున్న‌వ‌ని ఎందుకు మాట్లాడ‌లే. ఒక్క‌సారి మీ నాయిన ప‌ద‌వి పోయినంక నాదేం సాగుత‌లేద‌ని పార్టీ పెట్టుకున్న‌వ్‌. ఇగ ఎక్క‌డైనా స‌రే వెళ్లి దోచుకోవ‌చ్చ‌ని పార్టీ పెట్టిన‌వ్ అని అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు.

రేపు ప్ర‌జ‌ల‌కు ఏం న్యాయం చేస్త‌వ్‌..

ఆ పార్టీల చేరేవాళ్లంతా రాక్షసులే. వాళ్లంతా దోచుకోవ‌డానే పార్టీ పెట్టిన‌వా? ఒక తండ్రి త‌న పిల్ల‌ల‌ను చ‌దివిస్త‌డు. వారికి ఏం కావాలో అది చేస్త‌డు. అట్లాంటి తండ్రిపైనే నువ్ కొట్లాడుత‌న్న‌వంటే రేపు ప్ర‌జ‌ల‌కు, ఆ పార్టీకి ఏం న్యాయం చేస్త‌వ్ అని అడుగుతున్నా. ఈ టీఆర్ఎస్ గానీ, బీఆర్ఎస్ గానీ కేవ‌లం దోచుకోవ‌డానికే పార్టీలు పెట్టిండ్రు. పేద ప్ర‌జ‌ల‌కు, ఏ ఒక్క‌రికీ న్యాయం చేయాల‌ని పెట్ట‌లేదు.

Advertisement
Advertisement