త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka | డివైడ‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఇన్‌స్పెక్ట‌ర్ స‌జీవ ద‌హ‌నం

Karnataka | ఎదురుగా వ‌స్తున్న ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయి, డివైడ‌ర్‌ను ఢీకొన్న ఘ‌ట‌న‌లో కారులో మంట‌లు చెల‌రేగి కారు న‌డిపిస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ (Inspector) శాలిమ‌ఠ్ స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు

A

News | Published On Dec 6, 2025, 2.48 pm IST

Karnataka | డివైడ‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఇన్‌స్పెక్ట‌ర్ స‌జీవ ద‌హ‌నం
Advertisement

Karnataka | జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్త‌న్న కారు డివైడ‌ర్‌ను ఢీకొన‌డంతో కారు న‌డుపుతున్న ఇన్‌స్పెక్ట‌ర్ (Inspector) శాలిమ‌ఠ్ (38) అక్క‌డిక‌క్క‌డే స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క (Karnataka) రాష్ట్రం ధార్వాడ్ (Dharwad) జిల్లా అన్నిగెరి (Annigeri)లో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు గ‌ద‌గ్ లోకాయుక్త ఎస్పీ కార్యాల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న శాలిమ‌ఠ్ వ్య‌క్తిగ‌త ప‌ని నిమిత్తం త‌న హ్యుందాయ్ ఐ20 కారులో వెళ్తున్న క్ర‌మంలో ఎదురుగా వ‌స్తున్న ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని త‌ప్పించే ప్ర‌య‌త్నంలో డివైడ‌ర్‌ను ఢీకొన్నాడు. దీంతో వాహ‌నంలో మంట‌లు వ్యాపించాయి. వాహ‌నం నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేక‌పోవ‌డంతో మంట‌లు అంటుకుని ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకుని ప‌రిస్థితి అదుపులోకి తీసుకువ‌చ్చారు. అప్ప‌టికే వాహ‌నం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, సంఘ‌ట‌న‌కు దారితీసిన ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్నారు.

క‌ర్ణాట‌క‌లో ఇటీవ‌లే రోడ్డుప్ర‌మాదంలో ఐఏఎస్ అధికారి మృతి

స‌రిగ్గా ప‌దిరోజుల క్రితం క‌ర్ణాట‌క రాష్ట్రం కాలాబురగి జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి మ‌హంతీశ్ బిలాగీ చ‌నిపోయారు. క‌ర్ణాట‌క స్టేట్ మిన‌ర‌ల్స్ కార్పొరేష‌న్ ఎండీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న ఆయ‌న స‌న్నిహితుల వివాహానికి హాజ‌ర‌య్యేందుకు వెళ్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. రోడ్డుపై అడ్డంగా వ‌చ్చిన కుక్క‌ను త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నించ‌గా, కారు అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ముగ్గురు మృతిచెందారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement