త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | హైడ్రాను ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తా: జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్‌

KCR | వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా బీఆర్ఎస్(BRS) ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని, అప్పుడు హైడ్రా(HYDRA)ను ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తామ‌ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌(Hyderabad)లో హైడ్రా అని పెట్టి అన్యాయంగా పేద‌ల ఇండ్ల‌ను కూలుస్తున్నార‌ని ఆవేద‌న చెందారు.

S

News | Published On Apr 20, 2026, 9.06 pm IST

KCR | హైడ్రాను ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తా: జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్‌
Advertisement

KCR: త్రినేత్ర‌.న్యూస్‌: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా బీఆర్ఎస్(BRS) ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని, అప్పుడు హైడ్రా(HYDRA)ను ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తామ‌ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న జ‌గిత్యాల ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ప్ర‌సంగించారు. హైద‌రాబాద్‌(Hyderabad)లో హైడ్రా అని పెట్టి అన్యాయంగా పేద‌ల ఇండ్ల‌ను కూలుస్తున్నార‌ని ఆవేద‌న చెందారు.

ఈ అందానికి బోడ‌ముండా హైడ్రా అని తెచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ నిజామాబాద్‌లో కూడా తెస్తామ‌ని అన్నాడు. హైద్రాబాద్‌లో హైడ్రా.. నిజామాబాద్‌లో నిడ్రా.. జ‌గిత్యాల‌లో జిడ్రా అంట‌డు ఇక‌. ఏం కావాలి.. మొత్తం పేద‌ల కొంప‌లు కూల్చుడేనా.. మేం మాత్రం మూడున్న‌ర‌ల క్ష‌ల మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చాం.. బ‌త‌క‌నిచ్చాం. ఇవాళ ఏం కూల‌గొట్టుడు పుస్త‌కాలు కూడా తీసుకోనివ్వ‌లేదు. గ్యారెంటీగా బీఆర్ఎస్ వ‌చ్చేది ఖాయం.. హైడ్రాను ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తాం అని మ‌న‌వి చేస్తున్నాం.. హైడ్రాను పీకేసి మొద‌టి సంత‌కంతో తీసి చెరువులో ప‌డేస్తాం దాన్ని.. 46 వేల చెరువులు బాగు చేశాం.. గుడిసె ఇల్లు కూల‌గొట్ట‌లేదు.. మూసీ వెంబ‌డ ప‌డ్డారు.. గ‌రీబోళ్ల‌ను ఏడిపిస్తున్న‌రు.. ఆ ప్రాజెక్టు అయ్యేది కాదు పీకేది కాదు.. 15 వేల ఇండ్ల‌ను కూల‌గొడుతార‌ట‌.. అది ధ‌ర్మ‌మేనా.. మూసీ మంచిగా చేయాలి.. ప‌నికిమాలిన హైడ్రా తెచ్చారు.. ఇండ్లు కూల‌గొట్టుడు ఎందుకు.. భూములు క‌బ్జా పెట్టే రియ‌ల్ ఎస్టేట్ దందా త‌ప్ప‌ న‌గ‌ర ప్ర‌జ‌ల కోసం కాదు.. ఈజీగా చేయాల్సిన దాన్ని నాశ‌నం చేశారు. గుండాగిరి, అరాచ‌క‌త్వం చేస్తున్నారు. ప్ర‌జా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీం కూడా రాలేదు అని కేసీఆర్ తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement