త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sumathi | మ‌ల్కాజిగిరి ఖ్యాతిని కాపాడ‌తా.. శాంతి భ‌ద్ర‌తల్లో రాజీ ప‌డ‌ను: సీపీ సుమ‌తి

CP Sumathi | మల్కాజిగిరి కమిషనరేట్‌ (Malkajgiri Commissionerate)కు ప్రశాంతమైన ప్రాంతంగా మంచి పేరుందని, ఆ ఖ్యాతిని కాపాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తామని సీపీ బి.సుమ‌తి అన్నారు. శుక్ర‌వారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

S

News | Published On May 1, 2026, 5.46 pm IST

CP Sumathi | మ‌ల్కాజిగిరి ఖ్యాతిని కాపాడ‌తా.. శాంతి భ‌ద్ర‌తల్లో రాజీ ప‌డ‌ను: సీపీ సుమ‌తి
Advertisement
  • డ్ర‌గ్స్ కట్ట‌డికి ఏఐ ఆధారిత నిఘా
  • సైబ‌ర్ నేరాల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం
  • క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పై దృష్టి పెడ‌తా
  • ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పెద్దపీట
  • బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌లో మ‌ల్కాజిగిరి సీపీ బి. సుమ‌తి వెల్ల‌డి

CP Sumathi | త్రినేత్ర‌.న్యూస్‌: మల్కాజిగిరి కమిషనరేట్‌ (Malkajgiri Commissionerate)కు ప్రశాంతమైన ప్రాంతంగా మంచి పేరుందని, ఆ ఖ్యాతిని కాపాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తామని సీపీ బి.సుమ‌తి అన్నారు. శుక్ర‌వారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెడ‌తామ‌న్నారు. మహిళా పోలీస్ కమిషనర్‌గా త‌న‌ను నియమించిన ప్రభుత్వానికి, సహకరించిన డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. పారదర్శకతతో టీమ్ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని చెప్పారు.

బాధ్య‌త‌గా భావిస్తా..

మల్కాజిగిరికి మొదటి మహిళ పోలీస్ కమిషనర్ గా నియమించడం ఆనందంగా, బాధ్యతగా భావిస్తున్నా. ప్రజలకు అత్యంత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యం. మల్కాజిగిరి కమిషనరేట్‌కు ప్రశాంతమైన ప్రాంతంగా పేరుంది. ఆ ఖ్యాతిని కాపాడుతా. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పని చేస్తాం అని సుమ‌తి పేర్కొన్నారు.

నేరాల నియంత్ర‌ణ‌కు AI ఆధారిత “TG QUEST”..

నేరాల నియంత్రణలో AI ఆధారిత “TG QUEST” వినియోగిస్తామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కఠినంగా ప్రాసెస్ ఓరియెంటెడ్ & రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ తో వ్యవహరిస్తామని చెప్పారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి..

సమాజానికి పెను సవాలుగా మారిన "మాదకద్రవ్యాల (Drugs)" అక్రమ రవాణా, వినియోగంపై ప్రివెన్షన్, డిటెక్షన్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ పై దృష్టి పెడతామన్నారు. యువత మత్తుకు బానిస కాకుండా AI ఆధారిత నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కమిషనరేట్ లోని సిటిజన్స్ ప్రయాణ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడమే ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌న్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా త‌గిన‌ చర్యలు తీసుకుంటామని సుమ‌తిపేర్కొన్నారు. అంత‌కుముందు ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

Advertisement
Advertisement