త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Beach | ఇక ప‌రుగు పెట్ట‌నున్న హైదరాబాద్ న‌గ‌ర ప‌ర్యాట‌కం

Hyderabad Beach | త్వ‌ర‌లో హైద‌రాబాద్ (Hyderabad) దేశంలోనే టూరిజం హ‌బ్‌గా మార‌నుంది. దీనికోసం తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ (Global Summit)లో వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది పూర్త‌యితే న‌గ‌రంలో బీచ్‌, అండ‌ర్ గ్రౌండ్ అక్వేరియం అందుబాటులోకి రానున్నాయి

A

News | Published On Dec 9, 2025, 5.05 pm IST

Hyderabad Beach | ఇక ప‌రుగు పెట్ట‌నున్న హైదరాబాద్ న‌గ‌ర ప‌ర్యాట‌కం
Advertisement

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో ప‌లు ఎంవోయూలు
Hyderabad Beach | తెలంగాణ (Telangana) ప్ర‌భుత్వం కుదుర్చుకున్న ఎంవోయూ (MOU) ల‌తో హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రం ప‌ర్యాట‌కం ప‌రుగులు పెట్ట‌నుంది. ఈ మేర‌కు ప‌లు సంస్థ‌ల‌తో ప్ర‌భుత్వం అవ‌గాహ‌నా ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ (Global Summit)లో వివిధ సంస్థ‌ల‌తో ఒప్పంద ప్ర‌క్రియ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే బీచ్ అనుభూతి న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. కొత్వాల్ గూడ‌లో 35 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేయబోతున్నారు. సుమారు రూ. 235 కోట్ల వ్యయంతో రూపొందనున్న ఈ ప్రాజెక్టుకు స్పెయిన్‌ కంపెనీలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. సాధారణ ప్రజలకు సౌకర్యవంతమైన చార్జీలతో బీచ్‌లో స్నానం, బోటింగ్ వంటి వినోదాలను ఆస్వాదించే అవకాశముంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రత్యేక ఈవెంట్ల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నారు.

న‌గ‌రంలో ట‌న్నెల్ అక్వేరియం క‌నువిందు చేయ‌నుంది. దుబాయ్, సింగపూర్ తరహాలో నీటి అడుగున నడుస్తూ సముద్ర జీవులను దగ్గరగా చూసే అనుభూతిని అందించేందుకు రూ. 300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ముందుకు వస్తోంది. కెడాల్ సంస్థ ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక భారత్ ఫ్యూచర్‌ సిటీలో వెయ్యి కోట్ల విలువైన అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం నెలకోనుంది. ప్రపంచ దేశాల కళలు, సంస్కృతి, ప్రదర్శనలు, సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చేలా ఈ కేంద్రాన్ని రూపుదిద్దుతున్నారు. అదే ప్రాంతంలో ప్రేక్షకులు ప్రత్యేకంగా రూపొందించిన కుర్చీల్లో కూర్చుని, తాము చూస్తున్న దృశ్యంలో ఉన్నట్టుగా అనుభూతి పొందే ఫ్లయింగ్ థియేటర్ కూడా ఏర్పాటు కానుంది.

పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు వికారాబాద్‌లో క్యారవాన్ పార్కు ఏర్పాటయ్యే దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి. క్యారవాన్‌ ప్రయాణికులకు పార్కింగ్, ఎల‌క్ట్రిక్ వాహన చార్జింగ్, ఆహారం, వ్యూ ట‌వ‌ర్‌ వంటి సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉండనున్నాయి. ఇంకా పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు స్కూల్ ఆఫ్ టూరిజం ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్ (STEPS) అనే ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. చారిత్రక కోటల వద్ద రెంటల్ కాస్ట్యూమ్స్ వంటి క్రియేటివ్ పర్యాటక సేవలను అభివృద్ధి చేసే ప్రాజెక్టులను కూడా ప్రోత్సహించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే, హైదరాబాద్‌ దేశంలోని ప్రధాన టూరిజం హబ్‌గా మరింత బలపడే అవకాశం ఉంద‌ని భావిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement