త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | జ‌ర్న‌లిస్టులంద‌రికీ హైద‌రాబాద్‌లో ఇండ్ల స్థ‌లాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Ponguleti Srinivas Reddy | అర్హులైన జర్నలిస్టులందరి(Journalists) కీ హైదరాబాద్‌ (Hyderabad) లో ఇళ్ల స్థలాలు (Housing plots) కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సంబంధిత శాఖలతో చర్చలు జరిపి త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.

S

News | Published On May 1, 2026, 4.40 pm IST

Ponguleti Srinivas Reddy | జ‌ర్న‌లిస్టులంద‌రికీ హైద‌రాబాద్‌లో ఇండ్ల స్థ‌లాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
Advertisement
  • జూన్ 2న ప్ర‌క‌టిస్తాం
  • ఒకేచోట టౌన్‌షిప్ ఏర్పాటుకు ప్ర‌భుత్వం సానుకూలం
  • 10 మందికి మించ‌కుండా క‌మిటీ ఏర్పాటు చేయండి
  • జాబితా త‌యారు చేసి క‌మిటీకివ్వాలి
  • హౌసింగ్ సొసైటీల ప్ర‌తినిధుల‌తో మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: అర్హులైన జర్నలిస్టులందరి(Journalists) కీ హైదరాబాద్‌ (Hyderabad) లో ఇళ్ల స్థలాలు (Housing plots) కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని అన్నీ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో శుక్ర‌వారం నిర్వ‌హించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంబంధిత శాఖలతో చర్చలు జరిపి త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు తమ సమస్యలు, అభ్యర్థనలను మంత్రి దృష్టికి తెచ్చారు. అనంత‌రం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. జర్నలిస్టులందరూ ఓకే మాట మీదకు రావడం శుభ పరిణామమ‌న్నారు. అన్నీ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూన్ 2న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రకటన చేస్తామ‌ని వెల్లడించారు.

న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

సొసైటీలతో కలిపి 10 మందికి మించకుండా ఒక కమిటీ ఏర్పాటు చేసి అందరి వివరాలు సమాచార కమిషనర్ నేతృత్వంలోని సభ్యులకు అందజేయాలన్నారు. హైదరాబాద్ లో పది సంవత్సరాలు పని చేసే నిబంధనతో పాటు, ప్రభుత్వం అలాట్ చేసే నాటికి అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్పష్టం చేసారు. ప్రజా ప్రతినిధులకు, బ్యూరోక్రాట్స్, జర్నలిస్టులందరికీ కలిపి ఒకేచోట టౌన్ షిప్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచ‌న అని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా కేటాయింపులు జరపాలనేది ప్రభుత్వ విధానమని మంత్రి తెలిపారు.

నేటి నుంచే క‌స‌ర‌త్తు చేయండి..

సొసైటీల పేరుతో గతంలో ఇచ్చిన మాదిరి కేటాయింపులు చేయమన్నారు. సొసైటీలోని సభ్యులతో ఆయా సొసైటీలు జాబితా తయారు చేసి, కమిటీకి ఇవ్వాల‌ని.. వాటిని సమాచార కమిషనర్ పరిశీలిస్తార‌ని పేర్కొన్నారు. కేటాయింపు ధర విషయంలో జర్నలిస్టులకు ఇబ్బంది ఉండ‌ద‌న్నారు. నేటి నుంచి ఆలస్యం చేయకుండా సొసైటీ పనుల వేగం పెంచాల‌ని సొసైటీల ప్రతినిధులను కోరారు.

ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డితో పాటు వివిధ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement