త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Reservations | రెండేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల‌ను మోసం చేస్తోంది: వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

BC Reservations | కాంగ్రెస్ (Congress) పార్టీ బీసీ (BC)లకు 42 శాతం రిజర్వేషన్ (Reservations) అమలుకు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వచ్చిన‌ రెండేళ్ల నుంచి బీసీల‌ను మోసం చేస్తూనే ఉంద‌ని బీఆర్ఎస్ (BRS) రాజ్య‌స‌భ స‌భ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర (Ravichandra) మండిప‌డ్డారు. రెండేళ్ల నుంచి బీసీలు అవ‌మానాల‌కు గుర‌వుతూనే ఉన్నార‌ని చెప్పారు. అవుతుంది. అందుకే బీసీ రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం పార్ల‌మెంట్‌ (Parliament)లో ప్రైవేటు బిల్లు (Private Bill)ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ (BRS) బీసీ నాయ‌కులు వ‌ద్దిరాజును ఘ‌నంగా స‌న్మానించారు.

A

News | Published On Dec 13, 2025, 6.07 pm IST

BC Reservations | రెండేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల‌ను మోసం చేస్తోంది: వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌
Advertisement

అందుకే బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం పార్ల‌మెంట్‌లో ప్రైవేటు బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు వెల్ల‌డి

BC Reservations | కాంగ్రెస్ (Congress) పార్టీ బీసీ (BC)లకు 42 శాతం రిజర్వేషన్ (Reservations) అమలుకు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వచ్చిన‌ రెండేళ్ల నుంచి బీసీల‌ను మోసం చేస్తూనే ఉంద‌ని బీఆర్ఎస్ (BRS) రాజ్య‌స‌భ స‌భ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర (Ravichandra) మండిప‌డ్డారు. రెండేళ్ల నుంచి బీసీలు అవ‌మానాల‌కు గుర‌వుతూనే ఉన్నార‌ని చెప్పారు. అవుతుంది. అందుకే బీసీ రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం పార్ల‌మెంట్‌ (Parliament)లో ప్రైవేటు బిల్లు (Private Bill)ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ (BRS) బీసీ నాయ‌కులు వ‌ద్దిరాజును ఘ‌నంగా స‌న్మానించారు.

అనంత‌రం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఇత‌ర బీసీ నాయ‌కుల‌తో క‌లిసి వ‌ద్దిరాజు ర‌విచంద్ర మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీ లీడర్లతో జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరుతో డ్రామా చేశారని మండిప‌డ్డారు. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత అమలు కాదని తేల్చారని చెప్పారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని జీవో తెచ్చి మరో మోసానికి తెరలేపార‌ని ఆరోపించారు. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని కేటీఆర్, హరీష్ రావు అనేక సార్లు డిమాండ్ చేస్తే, ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. సాయి ఈశ్వరాచారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా నాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. నేడు బీసీలకు ఇస్తామన్న హామీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుంటే బీసీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడిన అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ విజ‌యం సాధించిందని చెప్పారు. కులగణన పూర్తిగా ఆశాస్త్రీయమ‌ని, కులగణన పేరుతో బీసీలను తక్కువ చేసి చూపించారని విమ‌ర్శించారు. మధ్యప్రదేశ్ లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఎలా సాధ్యం అయిందో వెళ్ళి చూస్తే అర్ధం అవుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చామని బీహార్ లో అబద్ధం చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిడ్డగా తాను ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టానని, ఈ బిల్లుకు మద్దతుగా అన్ని పార్టీల మద్దతు కోరుతామని స్ప‌ష్టం చేశారు.

రేవంత్‌కు మెస్సీపై ఉన్న ప్రేమ బీసీల‌పై లేదు: మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

రేవంత్ రెడ్డికి మెస్సీ మీద ఉన్న ప్రేమ బీసీల‌పై లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఆత్మ‌హ‌త్య చేసుకున్న సాయి ఈశ్వర్ చారి కుటుంబాన్ని రేవంత్‌రెడ్డి క‌నీసం ఓదార్చ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. నల్లగొండ జిల్లాలో ఒక బీసీ వ్యక్తికి మూత్రం తాగించార‌ని, దీనిపై విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నా, ఇప్ప‌టికీ చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారో రాహుల్ గాంధీ తెలుసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీకి ఫుట్ బాల్ మ్యాచ్ చూసే టైం ఉంటుంది గానీ, బీసీల‌కు ఇచ్చిన హామీల‌పై చ‌ర్చించేందుకు స‌మ‌యం ఉండ‌ద‌ని విమ‌ర్శించారు. రాహుల్‌, రేవంత్‌లు రోజూ బీసీల‌తో ఫుట్ బాల్ ఆడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బీసీ బిల్లుపై కాంగ్రెస్‌, బీజేపీల వైఖ‌రి స్ప‌ష్టం చేయాలి: ఎమ్మెల్సీ ఎల్ ర‌మ‌ణ‌

బీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యం మేర‌కు పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై కాంగ్రెస్‌, బీజేపీలు త‌మ వైఖ‌రి స్ప‌ష్టం చేయాల‌ని ఎమ్మెల్సీ ఎల్ ర‌మ‌ణ డిమాండ్ చేశారు. బీసీలు ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకోకూడ‌ద‌ని కోరారు. ఆత్మ‌హ‌త్య‌ల వ‌ల‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని చెప్పారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, కేసీఆర్ (KCR) ముఖ్య‌మంత్రి కాబోతున్నాడ‌ని పేర్కొన్నారు. అప్పుడు బీసీ స‌మ‌స్య‌లు అన్నీ ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని వివ‌రించారు.

త‌డిగుడ్డ‌తో బీసీల గొంతు కోస్తున్నారు: ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్

రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తుంటే త‌డిగుడ్డ‌తో బీసీల గొంతు కోస్తున్న‌ట్లు అనిపిస్తోంద‌ని అన్నారు. నాలుగు కోట్ల మంది ప్ర‌జ‌లున్న తెలంగాణ‌లో రెండు కోట్ల మందికి పైగా బీసీలు ఉన్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో బీసీల‌తో గుంపు మేస్త్రీ రోజూ ఫుట్‌బాల్ ఆడుతున్నారని మండిప‌డ్డారు. ప్ర‌జాకోర్టులో రేవంత్‌రెడ్డిని శిక్షించాల‌ని అన్నారు. ఆరు నెలల్లో బీసీలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అవినీతి కేసులపై పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకునే రేవంత్ రెడ్డి... బీసీల హ‌క్కులు కాపాడేందుకు ఎందుకు పెద్ద లాయ‌ర్ల‌ను పెట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఫ్రాడ్ సిటీలో రూ.150 కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

బీసీల‌పై ఎందుకీ వివ‌క్ష‌: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

కేంద్రంలో కొత్త చట్టాలు, కొత్త బిల్లులు వస్తూనే ఉన్నాయని, కానీ బీసీల‌పై ఎందుకు ఇంత వివ‌క్ష అని మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోంద‌ని విమ‌ర్శించారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు సాధించారని చెప్పారు. వారికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త వ‌చ్చిన‌పుడు మ‌న‌కు ఎందుకు రాద‌ని ప్ర‌శ్నించారు. అత్యంత ఎక్కువ అవసరం ఉన్నటువంటి ప్రజానికానికి అవసరమైన డిమాండ్ పట్ల కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుందని ఆరోపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement