త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | తెలంగాణ త‌ల్లి ఆవిర్భావ దినోత్స‌వంగా డిసెంబ‌ర్ 9: సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy | ప్ర‌త్యేక తెలంగాణ (Telangana) ఏర్పాటు చేస్తున్న‌ట్లు తొలిసారిగా అప్ప‌టి కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన డిసెంబ‌ర్ 9న తెలంగాణ త‌ల్లి అవ‌త‌ర‌ణ దినోత్స‌వంగా అధికారికంగా నిర్వ‌హించనున్న‌ట్లు సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్ర‌క‌టించారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) వేదికగా రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా క‌లెక్ట‌రేట్ల‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించారు.

A

News | Published On Dec 9, 2025, 1.14 pm IST

Revanth Reddy | తెలంగాణ త‌ల్లి ఆవిర్భావ దినోత్స‌వంగా డిసెంబ‌ర్ 9: సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

గ్లోబ‌ల్ స‌మ్మిట్ వేదిక‌గా వ‌ర్చువ‌ల్‌గా అన్ని క‌లెక్ట‌రేట్ల‌లో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Revanth Reddy | తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను ప్ర‌తిబింబిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం తీసుకున్న రోజైన డిసెంబ‌ర్ 9వ తేదీని తెలంగాణ (Telangana) త‌ల్లి అవ‌త‌ర‌ణ దినోత్స‌వంగా అధికారికంగా జ‌రుపుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్ర‌క‌టించారు. అదే రోజు సోనియాగాంధీ పుట్టిన రోజ‌ని, తెలంగాణ రాష్ట్ర ప్ర‌క‌ట‌న చేసిన రోజ‌ని చెప్పారు. ఆ రోజు తెలంగాణ‌కు ఎంతో సంతోషాన్ని క‌లిగించింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత మొట్ట‌మొద‌టిసారి ఏర్ప‌డిన ప్ర‌జాపాల‌న ఇందిరమ్మ రాజ్యంలో ఆ రోజు ప్రాధాన్య‌త‌ను గుర్తించామ‌ని పేర్కొన్నారు. ఇది క‌ల‌కాలం గుర్తుండిపోతుంద‌న్నారు. తెలంగాణ త‌ల్లి ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) వేదికగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ (Virtual) గా ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ‌ను మార్చామని చెప్పారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌ల‌ను ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మ‌రిచిపోర‌ని అన్నారు. తెలంగాణలో సంక్షేమ‌ పథకాలు, కార్యక్రమాల్లో వారి స్ఫూర్తి కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు, సోనియా గాంధీ జన్మదినోత్సవాలను తెలంగాణ ప్రజలు నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ ఆస్థిత్వానికి ప్రతీకగా, పరిపాలనకు స్ఫూర్తిదాయకంగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాలను అన్ని జిల్లాల పరిపాలన కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భమన్నారు.

33 జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌లో రూ.5.8 కోట్ల‌తో విగ్ర‌హాలు

రాష్ట్రంలోని 33 జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌లో రూ.5.8 కోట్ల‌తో విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. ఆ నిధుల‌ను పార‌ద‌ర్శ‌కంగా, స‌క్ర‌మంగా వినియోగించి, నిర్ణీత గ‌డువులోగా విగ్ర‌హాల‌ను త‌యారు చేయ‌డంలో కృషి చేసిన అధికారులు, శిల్పుల‌ను అభినందించారు. అన్ని క‌లెక్ట‌రేట్ల‌లోనూ 18 అడుగుల ఎత్తుతో విగ్ర‌హాల‌ను నెల‌కొల్పామ‌న్నారు. ఈ విగ్ర‌హాల ఆవిష్క‌ర‌ణ‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అధికారులు, రాష్ట్రంలో పెట్ట‌బడులు పెట్టిన పారిశ్రామిక‌వేత్త‌ల స‌మ‌క్షంలో జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, శ్రీ‌ధ‌ర్‌బాబు, కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాకిటి శ్రీ‌హ‌రి, జూప‌ల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement