త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadi Srinivas | వ‌రికి బోన‌స్ ఇచ్చిందే కాంగ్రెస్‌.. కేసీఆర్‌కు ఆ ఆలోచ‌నే రాలే: ఆది శ్రీ‌నివాస్‌

Aadi Srinivas | వ‌రికి బోన‌స్ (Bonus) ఇచ్చిందే కాంగ్రెస్ అని.. ఆ ఆలోచ‌న కేసీఆర్(KCR) కు ఎప్పుడైనా వ‌చ్చిందా అని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ ప్ర‌శ్నించారు. ధాన్యానికి బోనస్‌గా రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.3 వేల కోట్లు వేశామ‌న్నారు. అస‌లు రైతుల‌ను ఎప్పుడూ కలవని కేసీఆర్‌కు వారు ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరని ఎద్దేవా చేశారు.

S

News | Published On Apr 28, 2026, 4.11 pm IST

Aadi Srinivas | వ‌రికి బోన‌స్ ఇచ్చిందే కాంగ్రెస్‌.. కేసీఆర్‌కు ఆ ఆలోచ‌నే రాలే: ఆది శ్రీ‌నివాస్‌
Advertisement

Aadi Srinivas | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌రికి బోన‌స్ (Bonus) ఇచ్చిందే కాంగ్రెస్ అని.. ఆ ఆలోచ‌న కేసీఆర్(KCR) కు ఎప్పుడైనా వ‌చ్చిందా అని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ ప్ర‌శ్నించారు. ధాన్యానికి బోనస్‌గా రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.3 వేల కోట్లు వేశామ‌న్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌, బీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తరుగు పేరుతో రైతులను దోపిడీ చేశారని ఆరోపించారు. అస‌లు రైతుల‌ను ఎప్పుడూ కలవని కేసీఆర్‌కు వారు ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరని ఎద్దేవా చేశారు.

క‌విత మాట‌ల‌కు జ‌వాబివ్వు..

రైతు ప్రయోజనాలకు కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఆలోచనతో పాటు, పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చాం. సారు బయటకి రారు.. ఎవరినీ కలవరు.. అని స్వయంగా కేసీఆర్ కూతురు క‌విత‌నే చెప్పారు. రాష్ట్ర రైతులను పట్టించుకోర‌ని.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చెక్కులు ఇచ్చారని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ జ‌వాబు చెప్త‌లేరు. పైగా కాంగ్రెస్‌ను తప్పు పడుతున్నారు. అప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం ఏడాదికి రూ.2,800 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ప్ర‌స్తుతం వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ పంజాబ్‌ను దాటింది. ఈ సీజన్‌లోనూ 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నిర్వ‌హిస్తుంది అని శ్రీ‌నివాస్ వివ‌రించారు.

కాంగ్రెస్‌ను త‌ప్పుప‌ట్ట‌డం దేనికి?

వరికి బోనస్‌ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్‌కు ఎందుకు రాలే. కేవ‌లం రైతుబంధు అమలు చేసి మిగ‌తా ప‌థ‌కాల‌న్నీ ఆపేశారు. పంట నష్ట పరిహారం, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ నిలిపివేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసాతో పాటు గతంలో ఉన్న‌ పథకాలన్నింటిని అమలు చేస్తోంది. బీఆర్‌ఎస్ ను తెలంగాణ ప్ర‌జ‌లు ఎందుకు వ‌ద్ద‌నుకున్నారో వారే పోస్టుమార్టం చేసుకోవాలి. బీఆర్ఎస్ నేత‌లు ప్రజలనే తప్పు ప‌ట్టే ప‌రిస్థితి ఉంది. కవిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పని కేసీఆర్ కాంగ్రెస్‌ను తప్పు పట్ట‌డం విడ్డూరంగా ఉంది అని ఆది శ్రీ‌నివాస్ ఫైర‌య్యారు.

Advertisement
Advertisement