త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | కుల‌వృత్తులపై కాంగ్రెస్ దాడి.. విధ్వంస‌మే రేవంత్ ప‌ని

కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వం కులవృత్తుల‌ (Caste based occupations)పై దాడి చేస్తుంద‌ని మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ (Srinivas Goud) విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana bhavan)లో బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ (KCR) హయాంలో కుల వృత్తులను కాపాడుకుంటే రేవంత్ (Revanth) ప్ర‌భుత్వం వారి భ‌విష్య‌త్తును అంధ‌కారం చేసే ఆలోచ‌న చేస్తుంద‌ని మండిప‌డ్డారు.

S

News | Published On Mar 11, 2026, 5.53 pm IST

Srinivas Goud | కుల‌వృత్తులపై కాంగ్రెస్ దాడి.. విధ్వంస‌మే రేవంత్ ప‌ని
Advertisement

- గీత కార్మికుల హామీలు ఏమైన‌య్‌?
- నీరా కేఫ్‌ను ఎత్తేసేందుకు కుట్రలు
- నంద‌నం నీరా ఉత్ప‌త్తుల కేంద్రంపై నిర్ల‌క్ష్యం చేస్తే ఊరుకోం
- మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

త్రినేత్ర‌.న్యూస్‌: ఒక దేశం మరో దేశంపై దండయాత్ర చేసినట్లు, కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వం కులవృత్తుల‌ (Caste based occupations)పై దాడి చేస్తుంద‌ని మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ (Srinivas Goud) విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana bhavan)లో బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ (KCR) హయాంలో కుల వృత్తులను కాపాడుకుంటే రేవంత్ (Revanth) ప్ర‌భుత్వం వారి భ‌విష్య‌త్తును అంధ‌కారం చేసే ఆలోచ‌న చేస్తుంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress manifesto) లో కుల వృత్తులకు ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. గీత కార్మికులు ప్రమాదశావత్తు మరణిస్తే పది లక్షల ఎక్స్ గ్రేషియా (ex gratia) ఇస్తామని మాట త‌ప్పిన‌ట్లు చెప్పారు. ఇప్పటి వ‌ర‌కు 20 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయ‌ని వాపోయారు. ఆ డబ్బులు చెల్లించడానికి కూడా కమీషన్లు కావాలా అని ప్ర‌శ్నించారు.

పిల్ల‌లు కూడా తాగొచ్చు...

కేసీఆర్ హ‌యాంలో స‌కాలంలో ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా వచ్చేదని గుర్తు చేశారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్నట్టు రాష్ట్ర ప‌రిస్థితి త‌యారైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ (KCR) హ‌యాంలో నగరం నడి బొడ్డున 10 కోట్ల రూపాయలతో నీరా కేఫ్ (Neera cafe) ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ దాన్ని ఎత్తేసే పనిలో ఉందని ఆగ్ర‌హించారు. ప్రైవేట్ పరం చేసే ఆలోచ‌న చేస్తే గ‌తంలో అడ్డుకున్నామ‌ని ఇప్పుడు మళ్లీ నీరాకేఫ్ ను ప్రైవేట్ పరం చేసేలా ప్రణాళికలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నోటిఫికేషన్ కూడా ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. పిల్లలతో సహా ప్ర‌తి ఒక్క‌రూ నీరా తాగొచ్చని.. కూల్ డ్రింక్స్ కంటే మంచిద‌న్నారు. నందనం (Nandanam) లో వంద శాతం పూర్త‌యిన నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

పీసీసీ చీఫ్‌దే బాధ్య‌త‌...

రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖకు మంత్రి ఉండో.. లేడో అనే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. వైన్స్ షాపులను సొసైటీకి కొంత శాతం కేటాయిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కోటి యాభై లక్షల తాటి చెట్లు త‌మ హయాంలో నాటామ‌ని ఇప్పుడు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయ‌క‌పోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. నీరా ఉత్పత్తి కేంద్రాల‌ను ఎలా నడిపించాలో అడిగితే తాము చెప్తామ‌ని వివ‌రించారు. నీరా కేఫ్‌ల‌ను కాపాడే బాధ్య‌త‌ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC chief Maheshkumar goud) పైనే ఉంద‌ని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు.

10 కులాలకు ఉపాధి..

నీరాకేఫ్ ను ప్రైవేటు పరం చేయకుండా గీత పారిశ్రామిక సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. అన్ని కుల వృత్తులకు పని దొరికే నీరా కేంద్రాలను కాపాడుకోవాలని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగేందర్ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కె కిషోర్ గౌడ్, ఉపేంద్ర చారి పాల్గొన్నారు.

Advertisement
Advertisement