త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy| 7 వేల కోట్ల‌తో గాంధీ స‌రోవ‌ర్: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | గండిపేట నుంచి బాపూఘాట్ (Gandipet to Bapughat) వ‌ర‌కు మూసీ న‌ది(Musi river) ని తొలిద‌శ‌లో 7 వేల కోట్ల రూపాయల‌తో శుద్ధి చేసి సుంద‌రీకరించ‌నుంది. 21 కిలోమీట‌ర్ల (21 KM) పొడ‌వైన ఈ ప్రాంతాన్ని తొలి ఫేజ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీర్చిదిద్ద‌నున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ (DPR) విడుద‌లైంది.

S

News | Published On Mar 13, 2026, 9.35 pm IST

CM Revanth Reddy| 7 వేల కోట్ల‌తో గాంధీ స‌రోవ‌ర్: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

5 జోన్లుగా 55 కిలోమీట‌ర్ల మూసీ న‌ది
గండిపేట నుంచి బాపూఘాట్ వ‌ర‌కు
21 కిలోమీట‌ర్లు తొలి ఫేజ్‌గా
మూసీలోకి గోదావ‌రి నీళ్లు
కొత్త‌గా 14 బ్రిడ్జిలు, 3 బ్యారేజీలు
మూసీ పున‌రుద్ధ‌ర‌ణపై అధికారుల ప్ర‌జంటేష‌న్
హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి, ఇత‌ర మంత్రులు

త్రినేత్ర‌.న్యూస్: హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవాలంటే మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌నిస‌రి అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పున‌రుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో 2 కోట్ల జ‌నాభాకు చేరుకునే ఈ న‌గ‌రానికి అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు క‌ల్పించాలంటే ఉత్త‌మ‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను అనుస‌రించాల‌ని చెప్పారు. తెలంగాణ‌కు ఆయువుప‌ట్టైన హైద‌రాబాద్ న‌గ‌రం ఆర్థికంగా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా, సాంస్కృతిక ప‌రంగా, వార‌స‌త్వ ప‌రంగా మ‌రింత ఎత్తుకు ఎదగాలంటే జీవ‌రేఖ‌గా ఉన్న మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసి పున‌రుజ్జీవింప‌జేయాల‌ని అభిల‌షించారు. ఇందుకోసం తాను 2 ఏండ్ల నుంచి నిరంత‌రం అధ్య‌య‌నం చేస్తున్నాన‌ని, అనేక మంది నిపుణుల‌తో చ‌ర్చిస్తున్నాని సీఎం తెలిపారు.

గండిపేట నుంచి బాపూఘాట్ వ‌ర‌కు మూసీ న‌దిని తొలిద‌శ‌లో 7 వేల కోట్ల రూపాయల‌తో శుద్ధి చేసి సుంద‌రీకరించ‌నుంది. 21 కిలోమీట‌ర్ల (21 KM) పొడ‌వైన ఈ ప్రాంతాన్ని తొలి ఫేజ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీర్చిదిద్ద‌నున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ (DPR) విడుద‌లైంది. ఈ మేర‌కు అధికారులు శుక్ర‌వారం జ‌రిగిన రివ‌ర్ మూసీ రిజునివేష‌న్ కార్య‌క్ర‌మంలో వివ‌రాలు వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి త‌దిత‌రులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ఎం.డి. ఈ వెంక‌ట న‌ర్సింహారెడ్డి మూసీ పున‌రుద్ధ‌ర‌ణ వివ‌రాల‌ను ప్ర‌జంటేష‌న్ (Presentation) గా ఇచ్చారు.

5 జోన్లుగా విభ‌జించి..

న‌గ‌రంలో గండిపేట నుంచి మొద‌లై గౌరెల్లి వ‌ర‌కు 55 కిలోమీట‌ర్ల పొడ‌వునా ప్ర‌వ‌హించే మూసీ న‌దిని సుంద‌రీక‌ర‌ణ నిమిత్తం 5 జోన్లుగా విభ‌జించారు.
జోన్ 1- గండిపేట - గాంధీ స‌రో్వ‌ర్ వ‌ర‌కు -21 కిలోమీట‌ర్లు
జోన్ 2- గాంధీ స‌రోవ‌ర్ నుంచి పురానాపూల్ - 6 కిలోమీట‌ర్లు
జోన్ 3 - పురానాపూల్ నుంచి ఎంజీబీఎస్‌ - 4 కిలోమీట‌ర్లు
జోన్ 4- ఎంజీబీఎస్ నుంచి ఉప్ప‌ల్ - 8 కిలోమీట‌ర్లు
జోన్ 5- ఉప్ప‌ల్ నుంచి ఓఆర్ ఆర్ - 16 కిలోమీట‌ర్లు

కాగా, రాష్ట్ర ప్ర‌భుత్వం తొలి ద‌శ‌లో 21 కిలోమీట‌ర్ల మేర పున‌రుద్ధ‌రింప‌జేసి సుంద‌రీక‌రించ‌నుంది. అంత‌ర్జాతీయ కంపెనీలైన మెన్ హార్డ్‌, క్యుష్‌మాన్ ఆండ్ వేక్ ఫీల్డ్ రియోస్ క‌న్సార్షియ‌మ్‌కు మాస్ట‌ర్ ప్లానింగ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జ‌ల‌మండ‌లికి కేటాయించి ఉన్న గోదావ‌రి జ‌లాలు 20 టీఎంసీల్లో 1.75 టీఎంసీ తాగునీటికి..2.5 టీఎంసీల‌ను మూసీ పున‌రుద్ధ‌ర‌ణ కోసం వినియోగిస్తారు. 365 రోజులు మూసీలో నీళ్లు ప్ర‌వ‌హిస్తూ ఉండేలా గోదావ‌రి జ‌లాల‌ను వాడుకుంటారు. 55 కిలోమీట‌ర్ల పొడ‌వునా 9 కొత్త వంతెన‌లు, 3 బ్యారేజీలు నిర్మిస్తారు. ఇప్ప‌టికే ఉన్న 5 వంతెన‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తారు. మూసీ న‌ది వెంట ఉన్న బ‌ఫ‌ర్ జోన్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తారు. 27 నాలాలు మూసీలో క‌లుస్తున్నాయి. ఇత‌ర చిన్న నాలాలు చాలా ఉన్నాయి. నాలాల నుంచి వచ్చే నీళ్ల‌ను ఎస్టీపీలో శుద్ధి అయిన త‌ర్వాతే మూసీలోకి వ‌ద‌లుతారు.ఘ‌న వ్య‌ర్థాల డంపింగ్ జ‌ర‌గ‌కుండా చూస్తారు.

తొలి దశ … 36 నెలలు.. 7 వేల కోట్లు

మూసీ పునరుద్ధరణపై ప్రభుత్వం టార్గెట్ పిక్స్ చేసుకుంది. తొలి దశలో జోన్ 1లో గండిపేట - గాంధీ స‌రోవ‌ర్ (Gandhi sarovar) వ‌ర‌కు -21 కిలోమీట‌ర్లు సర్వాందసుందరంగా చేయనున్నారు. 36 నెలల్లో మూసీ పునరుద్ధరణ (Moosi beautification) లో తొలి దశ పూర్తి చేస్తామని, దీని కోసం రూ. 7 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. మెన్ హార్డ్‌, క్యుష్‌మాన్ ఆండ్ వేక్ ఫీల్డ్ రియోస్ క‌న్సార్షియ‌మ్‌కు మాస్ట‌ర్ ప్లానింగ్ బాధ్య‌త‌లు అప్పగించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement