Revanth Reddy| కేసీఆర్ ను ఓడగొట్టేందుకు హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారు
బీఆర్ ఎస్ కుటుంబంలో ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నాయని కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు హరీశ్‌రావు, కేటీఆర్ పోటీపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో లెక్కలు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నామని తెలిపారు
త్రినేత్ర, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని దీన్ని సమిష్టిగా అడ్డుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశానికి ముందు ఇష్టాగోష్టి (చిట్‌చాట్) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పేదల ఆకలి తీరుస్తున్న ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం మరణశాసనం రాస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లను ఇస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు. తన మనవడిని క్రీడాకారుడిని చేసేందుకే మెస్సీ మ్యాచ్ కు తీసుకెళ్లానని చెప్పారు. అంతేకానీ తన మనవడిని పబ్బులకో, గబ్బులకో పంపనని ఎద్దేశా చేశారు. మెస్సీ మ్యాచ్‌కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని స్పష్టం చేశారు. అర్బన్ ఫారెస్ట్రీలో భాగంగా ఫూచర్ సిటీలో 3 వేల ఎకరాల్లో జూపార్క్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. రిలయన్స్ సంస్థ ప్రతిపాదించిన వంతారా వస్తుందా రాదా ఎదురుచూద్దామని తెలిపారు. ప్రతీ పనికి పారదర్శకంగా గ్లోబల్ టెండర్ ద్వారానే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. .స్పోర్ట్స్ ఎరీనాలో భాగంగా అన్ని రకాల క్రీడలకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తామని రాబోయే రోజుల్లో ఎయిర్ పోర్ట్ సెంట్రిక్ గా అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు.
హరీశ్ వర్సెస్ కేటీఆర్.. ఫ్యామిలీ పాలిటిక్స్
బీఆర్ ఎస్ కుటుంబంలో ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నాయని కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు హరీశ్‌రావు, కేటీఆర్ పోటీపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో లెక్కలు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నామని తెలిపారు. ఈ- కార్ రేసు కేసులో ప్రభుత్వం ప్రొసీజర్స్ ప్రకారమే నడుచుకుంటుందని, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు DoPT అనుమతి కోరామని చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



