త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేపే బీఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హ‌రీశ్‌రావు విషెస్

Harish Rao | కేసీఆర్ (KCR) నాయకత్వంలో బీఆర్ఎస్‌ (BRS) పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి హ‌రీశ్‌రావు సిల్వర్ జూబ్లీ(Silver jubilee) శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఆదివారం దుద్దెడ(Duddeda) చౌడాలమ్మ ఉత్సవాల్లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

S

News | Published On Apr 26, 2026, 5.05 pm IST

Harish Rao | రేపే బీఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హ‌రీశ్‌రావు విషెస్
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్ (KCR) నాయకత్వంలో బీఆర్ఎస్‌ (BRS) పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి హ‌రీశ్‌రావు సిల్వర్ జూబ్లీ(Silver jubilee) శుభాకాంక్షలు తెలియ‌జేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ క‌ల‌ సాకారమైంద‌ని చెప్పారు. ఆదివారం దుద్దెడ(Duddeda) చౌడాలమ్మ ఉత్సవాల్లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లేదు.. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేద‌న్నారు.

దుద్దెడ చౌడాల‌మ్మ ఉత్స‌వాలకు రావ‌డం సంతోష‌క‌రం..

హ‌రీశ్‌రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. గుడి కమిటీ ఆహ్వానం మేరకు దుద్దెడ చౌడాలమ్మ దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం. ఈ పండుగ నిర్వహణ కోసం నా వంతుగా ఆర్థిక సహాయం అందజేశాను. గతంలో ఇక్కడి ప్రజల అవసరాల కోసం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం కేసీఆర్ రూ. 30 లక్షల నిధులు మంజూరు చేశారు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

బీఆర్ఎస్ లేక‌పోతే తెలంగాణ లేదు..

రేపు బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం (సిల్వర్ జూబ్లీ) జరుపుకోనున్న వేళ రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం నాలుగు కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చిన మహానాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ పుట్టడం వల్లే ఇవాళ దశాబ్దాల తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో, స్వయంపాలనలో ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అని ఉద్ఘాటించారు.

అంతా కేసీఆర్ కృషే..

ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా, 33 జిల్లాలుగా పరిపాలన సాగుతుందన్నా, మన సిద్దిపేట జిల్లా ఏర్పడిందన్నా అదంతా కేసీఆర్ కృషే. బీడువారిన ఈ నేలను ఇవాళ కాళేశ్వరం జలాలు ముద్దాడుతున్నాయి. అంటే దానికి కారణం తెలంగాణ రావడం, బీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల్లో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. నాటి ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది. తెలంగాణ సాధన కోసం నాలుగు కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చి, ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

Advertisement
Advertisement