Shamshabad | శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
Shamshabad | శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. ఇటీవల విమానాశ్రయంలో బాంబులు ఉన్నట్లు బెదిరింపు రాగా, తాజాగా సోమవారం ఉదయం విమానాశ్రయానికి రానున్న మూడు విమానాల్లో బాంబులు ఉన్నట్లు బెదిరింపు మెయిల్ (Mail) వచ్చింది
Shamshabad | శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి (Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ (Mail) వచ్చింది. విమానాశ్రయంలో ల్యాండ్ కానున్న మూడు విమానాల్లో బాంబులు ఉన్నట్లు సోమవారం ఉదయం మెయిల్ రావడంతో భద్రతా అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేరళ (Kerala) లోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో (Indigo) ఎయిర్‌లైన్స్ విమానం, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వచ్చిన లుఫ్తాన్సా (Lufthansa) ఎయిర్ లైన్స్ విమానం, లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ (British Airlines) విమానాల్లో బాంబులు ఉన్నట్లు బెదిరింపు రావడంతో ఆ విమానాలను ల్యాండింగ్ చేసి బాంబు స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్ (Dog Squad) బృందాలతో తనిఖీలు చేపట్టారు. ప్రయాణీకులను కిందికి దింపి ఐసోలేషన్ కు తరలించారు. విమానాలతో సహా ప్రయాణీకులు, వారి లగేజీ, కార్గోలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఈ బెదిరింపును ఉత్తదేనని తేల్చారు. మరోవైపు బాంబు ఉందంటూ మెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
కొనసాగుతున్న ప్రయాణికుల వెతలు
ఒకవైపు ఇండిగో విమానాల సంక్షోభం నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న ప్రయాణీకుల వెతలు కొనసాగుతున్నాయి. విమానాలను పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఇంకా కొన్ని విమానాలను రద్దు చేశారు. మరోవైపు ఒకేసారి మూడు విమానాలకు బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణీకులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఎటువంటి దుర్ఘటన చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Illegal trade of Oxytocin injections | నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజిక్షన్ల దందా గుట్టు రట్టు
మే 18, 2026

Kerala | 10 గంటలకు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మంది మంత్రులు కూడా..
మే 18, 2026

Southwest Monsoon | వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



