త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | అప్పుడు జిన్నా పాట‌..ఇప్పుడు సోనియా పాట‌: రాంచంద‌ర్‌రావు

Ramchander Rao | సోనియాగాంధీ (Sonia Gandhi) త్యాగం కార‌ణంగానే క్రిస్మ‌స్ జ‌రుపుకుంటున్నార‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchander Rao) మండిప‌డ్డారు.

A

News | Published On Dec 21, 2025, 4.55 pm IST

Ramchander Rao | అప్పుడు జిన్నా పాట‌..ఇప్పుడు సోనియా పాట‌: రాంచంద‌ర్‌రావు
Advertisement

Ramchander Rao | క్రిస్మ‌స్ వేడుక‌ల్లో (Christmas Celebrations) పాల్గొన్న‌ముఖ్య‌మంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు (Ramchander Rao) మండిప‌డ్డారు. సోనియాగాంధీ (Sonia Gandhi) త్యాగం కార‌ణంగానే క్రిస్మ‌స్ జ‌రుపుకుంటున్నార‌ని రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు క్రైస్త‌వ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మేన‌న్నారు. భార‌తదేశం లౌకిక రాజ్యమ‌ని, ఈ దేశంలో శ‌ర‌ణార్థులు కూడా స్వేచ్ఛ‌గా జీవిస్తున్నారని చెప్పారు. ఎవ‌రూ మైనారిటీల గురించి వ్యాఖ్యానించాల్సిన అవ‌స‌రం లేదని అన్నారు. అప్ప‌టి రోజుల్లో కాంగ్రెస్ (Congress) జిన్నా పాట‌లు పాడింద‌ని, ఇప్పుడు ఇటాలియ‌న్ రాజ‌మాత పాట‌లు పాడుతోందని విమ‌ర్శించారు.

ద్వేష‌పూరిత ప్ర‌సంగాల బిల్లుపై...

ద్వేష‌పూరిత ప్ర‌సంగాల‌పై బిల్లును తీసుకురానున్న‌ట్లు ప్ర‌క‌టించిన రేవంత్ మాట‌లు త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాయ‌ని రాంచంద‌ర్‌రావు చెప్పారు. ఇటీవ‌ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట్లు పొందేందుకు మ‌త‌ప‌రంగా రేవంత్ రెడ్డి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌ని మండిప‌డ్డారు. ముస్లింలు అంటేనే కాంగ్రెస్‌, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని వ్యాఖ్యానించార‌ని గుర్తు చేశారు. ప‌దేప‌దే విభ‌న రాజ‌కీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీయేన‌ని దుయ్య‌బ‌ట్టారు. ముందుగా కాంగ్రెస్ నాయ‌కులు ద్వేష‌పూరిత రాజ‌కీయాలు మానుకోవాల‌ని, హిందూత్వ‌ను ద్వేషించ‌డం మానుకోవాల‌ని హిత‌వు పలికారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement