త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Avinash Reddy | బీఆర్ఎస్‌కు అవినాష్ రెడ్డి రూ.10 ల‌క్ష‌ల విరాళం.. కేటీఆర్‌కు చెక్కు అంద‌జేత‌

Avinash Reddy | బీఆర్ఎస్(BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్పీటీసీ మాజీ స‌భ్యుడు పట్నం అవినాష్ రెడ్డి పార్టీ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల చెక్కు(Chek)ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)కు అంద‌జేశారు.

S

News | Published On Apr 27, 2026, 4.26 pm IST

Avinash Reddy | బీఆర్ఎస్‌కు అవినాష్ రెడ్డి రూ.10 ల‌క్ష‌ల విరాళం.. కేటీఆర్‌కు చెక్కు అంద‌జేత‌
Advertisement

Avinash Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్(BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్పీటీసీ మాజీ స‌భ్యుడు పట్నం అవినాష్ రెడ్డి పార్టీ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల చెక్కు(Cheque)ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)కు అంద‌జేశారు. పార్టీ ప‌టిష్ట‌త కోసం త‌న వంతు కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కేసీఆర్ హ‌యాంలో పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకెళ్ల‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, స‌బితా ఇంద్రారెడ్డి, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మ‌ధుసూద‌నాచారి, బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.

కాగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పార్టీ శ్రేణులు సోమ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన వేడుకల్లో గ్రామాలు, ప‌ట్ట‌ణ కేంద్రాల్లోని కార్య‌కర్త‌లు, నాయ‌కులు ఉత్సాహంగా పాల్గొని జెండాల‌ను ఆవిష్క‌రించారు.

Advertisement
Advertisement