త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్ ఎకానమీ రాదు: దాసోజు శ్ర‌వ‌ణ్‌

BRS | మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్ డాల‌ర్ల ఎకానమీ రాద‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan)మండిప‌డ్డారు. 2047 విజన్ డాక్యుమెంట్ (Vision Document) విడుదల చేస్తూనే ఇంగ్లీష్ వద్దంటున్నారని, దీనికి నవ్వాలా ఏడవాలా అని ప్రశ్నించారు. రేవంత్ హయాంలో తెలంగాణ రైజింగ్ (Telangana Rising) కాదు రావేజింగ్ అని, గ్లోబల్ సమ్మిట్‌ (Global Summit)లో ధరించిన బట్టలు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ఎద్దేవా చేశారు.

A

News | Published On Dec 11, 2025, 6.42 pm IST

BRS | మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్ ఎకానమీ రాదు: దాసోజు శ్ర‌వ‌ణ్‌
Advertisement

రేవంత్ ఓయూ ప్రసంగం విషపూరితమ‌ని ధ్వ‌జం
రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వంతో గురుకులాలు నిర్వీర్యమ‌వుతున్నాయ‌ని ఆవేద‌న‌
BRS | మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్ డాల‌ర్ల ఎకానమీ రాద‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan)మండిప‌డ్డారు. 2047 విజన్ డాక్యుమెంట్ (Vision Document) విడుదల చేస్తూనే ఇంగ్లీష్ వద్దంటున్నారని, దీనికి నవ్వాలా ఏడవాలా అని ప్రశ్నించారు. రేవంత్ హయాంలో తెలంగాణ రైజింగ్ (Telangana Rising) కాదు రావేజింగ్ అని, గ్లోబల్ సమ్మిట్‌ (Global Summit)లో ధరించిన బట్టలు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ (OU) పర్యటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓయూ కన్నతల్లి లాంటిదని, తాను అక్కడే చదువుకుని విద్యార్థి నాయకుడిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. నిన్న సీఎం ఓయూ వెళ్తే నాలుగు మంచి మాటలు మాట్లాడతారని అనుకున్నామని, కానీ కుక్క తోకకు రాయి కట్టినట్టు ఆయన తీరు మారలేదని ధ్వజమెత్తారు. సీఎం ప్రసంగం గందరగోళంగా, పొంతన లేని విషపూరితమైనదని విమర్శించారు. ప్రతి వేదికను కేసీఆర్‌పై ద్వేషం వెదజల్లేందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై విషం చల్లే మాటలు మానేస్తే రేవంత్‌కే మంచిదని సూచించారు.

నల్లమల అడవులతో సీఎం‌కు ఎలాంటి సంబంధం లేదని, పుట్టిన కొండారెడ్డిపల్లి నుంచి నల్లమలకు గంటన్నర ప్రయాణమని, మొగిలి లాగా క్రూర జంతువులతో ఆడుకున్నాడేమో అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్ ఓయూలో ఉద్యమం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి లాంటి అమరులు తెలంగాణ ద్రోహుల వల్లే ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. చదివిన చోటు కాదు, విజ్ఞత ముఖ్యమని, రేవంత్‌కు ఆ విజ్ఞత లేదని, కొండారెడ్డిపల్లి చదువైనా కొలంబియా చదువైనా ఆయన బుద్ధి వంకరబుద్ధే అని మండిప‌డ్డారు. ఎస్సీ వర్గీకరణకు మంద‌ కృష్ణ మాదిగ‌, సుప్రీంకోర్టు కారణం కాదు, తానే కారణమన్నట్టు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. కులగణనకు మోడీ ఒప్పుకోవడం నితీష్ కుమార్, బీహార్ ఎన్నికల వల్లేనని గుర్తుచేశారు.

రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నవారని, గతంలో ఇంటి ముందు నుంచి వెళ్లేవారు చెప్పులు విడిచి వెళ్లాలన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ స్థాపించిన గురుకులాలను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. 2.5 లక్షల మందికి నాణ్యత విద్య ఇస్తూ మిగతా 15 లక్షల మందిని విద్యకు దూరం చేస్తున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లపై బీసీల గొంతు కోసి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం డ్రామా అని మండిప‌డ్డారు.

నెహ్రూ ఇరిగేషన్, ఎడ్యుకేషన్ తెచ్చారని, తాను కమ్యూనికేషన్ తెస్తానన్నారని, యంగ్ ఇండియాను గాంధీ నుంచి ప్రేరణగా తీసుకున్నామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. స్కిల్ యూనివర్సిటీలో పట్టుమని పది కోర్సులు లేవని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి తెలంగాణ నిపుణులు లేరని కేరళ నుంచి వీసీని తెచ్చారని విమర్శించారు. గ్లోబల్ సమిట్‌లో ఇంగ్లీష్ మాట్లాడగలరు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా చదివే ఓయూలో ఇంగ్లీష్ అవసరం లేదంటారని, తనకు రాని ఇంగ్లీష్ ఇతరులకు రాకూడదనేది రేవంత్ విధానమని దుయ్య‌బ‌ట్టారు. రాహుల్ గాంధీ ఇంగ్లీష్ ప్రాధాన్యత చెబుతుంటే రేవంత్ వ్యతిరేకిస్తారని, ఐటీ రంగం విజయానికి ఇంగ్లీషే కారణమని తెలియదా అని ప్రశ్నించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement