త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BASF | హైద‌రాబాద్‌లో గ్లోబ‌ల్ స‌ర్వీస్ హ‌బ్.. జ‌ర్మ‌నీ సంస్థ సాకారంతో ఏర్పాటు

BASF | హైద‌రాబాద్‌లో "BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్" పేరిట గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం జ‌ర్మ‌నీ(German) కి చెందిన‌ అంతర్జాతీయ దిగ్గజ సంస్థ BASF (Badische Anilin- und Soda-Fabrik) ముందుకొచ్చింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు BASF కంపెనీ ప్రతినిధులు అంద‌జేశారు.

S

News | Published On May 5, 2026, 3.50 pm IST

BASF | హైద‌రాబాద్‌లో గ్లోబ‌ల్ స‌ర్వీస్ హ‌బ్.. జ‌ర్మ‌నీ సంస్థ సాకారంతో ఏర్పాటు
Advertisement
  • రాష్ట్ర మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబుకు ప‌త్రాలు అంద‌జేసిన బీఏఎస్ఎఫ్ కంపెనీ ప్ర‌తినిధులు
  • కొత్త‌గా మూడు వేల మందికి ఉపాధి

Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో "BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్" పేరిట గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం జ‌ర్మ‌నీ(German) కి చెందిన‌ అంతర్జాతీయ దిగ్గజ సంస్థ BASF (Badische Anilin- und Soda-Fabrik) ముందుకొచ్చింది. హోటల్ తాజ్ కృష్ణలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు BASF కంపెనీ ప్రతినిధులు అంద‌జేశారు.

200 దేశాల్లో కార్య‌క‌లాపాలు..

BASF గ్లోబల్ సర్వీస్ డెలివరీ నెట్ వర్క్, ఫైనాన్స్, హెచ్ఆర్ సర్వీసెస్ విభాగాల్లో వ్యూహాత్మక కేంద్రంగా ఈ గ్లోబల్ సర్వీసెస్ హబ్ నిల‌వ‌నుంది. దీని ఏర్పాటుతో కొత్తగా 3వేల మందికి ఉపాధి ల‌భించ‌నుంది. కాగా 160 ఏళ్ల చరిత్ర కలిగిన జర్మనీకి చెందిన BASF.. కెమికల్స్, మెటీరియల్స్, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, సర్ఫేస్ టెక్నాలజీస్, న్యూట్రిషన్ అండ్‌ కేర్, అగ్రికల్చరల్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో 200 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ దిగ్గ‌జ సంస్థ‌గా పేరు ఘ‌డించింది.

Advertisement
Advertisement