త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క మ‌లుపు

Phone Tapping | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తీవ్ర వివాదాలు రేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మ‌రో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. సిట్ పోలీసు క‌స్ట‌డీలో ఉన్న తెలంగాణ ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్‌ ప్ర‌భాక‌ర్‌రావు (Prabhakar Rao) క‌స్ట‌డీని మ‌రో వారం పాటు పొడ‌గిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

A

News | Published On Dec 19, 2025, 1.30 pm IST

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క మ‌లుపు
Advertisement

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక మ‌లుపుచోటు చేసుకొంది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) (SIB) మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి టి. ప్రభాకర్‌రావు (Prabhakar Rao) పోలీసు కస్టడీని సుప్రీం కోర్టు మ‌రో వారం రోజులు పొడిగించింది. ద‌ర్యాప్తుకు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌భాక‌ర్‌రావుకు సూచించింది. డిసెంబ‌ర్ 26న పోలీస్ క‌స్ట‌డీ నుంచి విడుద‌ల చేయాల‌ని సిట్ అధికారుల‌ను ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకూడ‌ద‌ని నిర్దేశించింది.

ఈ నెల 11న ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల‌తో కూడిన ధర్మాసనం ప్ర‌భాక‌ర్‌రావును అరెస్టు చేయ‌కుండా గ‌తంలో ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టు స‌వ‌రించింది. 12న ఉద‌యం 11 గంట‌ల క‌ల్లా కేసు ద‌ర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాల‌ని ఆదేశించింది. కస్టడీ విచారణ సమయంలో భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని దర్యాప్తు సంస్థకు స్పష్టం చేసింది. అతనికి అవసరమైన మందులు, కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని సూచించింది.

న్యాయ‌స్థానం ఆదేశంతో 12న ఉద‌యం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న లొంగిపోయారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ (Telangana)లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భాక‌ర్‌రావు విచార‌ణ‌లో ఏవైనా కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయా అని స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement