త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

కేసీఆర్ లేక‌పోతే క‌విత లేదు: జ‌గ్గారెడ్డి

నాకు, హరీష్ కు మా జిల్లా లో రాజకీయ శత్రుత్వం ఎప్పటికీ ఉంటుంది. అయితే నేను టీఆర్ ఎస్ వీడ‌డానికి హ‌రీశ్ రావు కార‌ణం కాదు. హరీష్ రావు కి ఈ విషయం లో సంబంధం లేదు..

a

News | Published On Dec 14, 2025, 9.35 pm IST

కేసీఆర్ లేక‌పోతే క‌విత లేదు: జ‌గ్గారెడ్డి
Advertisement

కేసీఆర్ లేక‌పోతే క‌విత లేదు: జ‌గ్గారెడ్డి
త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ లేక‌పోతే అస‌లు క‌విత లేనేలేద‌ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. త‌న‌కు, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్లే తాను టీఆర్ ఎస్ నుండి బ‌య‌టికి వ‌చ్చానంటూ ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్యానించ‌డం ఆమె అవ‌గాహ‌నా రాహిత్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శించారు. ఆమె చేస్తున్న వ్యాఖ్య‌ల‌న్నీ అబ‌ద్ధ‌మ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఆదివారం (2025 డిసెంబ‌ర్ 14) ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. " కేసీఆర్ కూతురు కవిత బీఆర్ ఎస్ పార్టీ నుండి బహిష్కరించిన తరువాత నా పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. జగ్గారెడ్డి కి హరీష్ రావు కు రాజకీయంగా పడకనే టీఆర్ ఎస్ పార్టీ నుండి జగ్గారెడ్డి బయటికి వచ్చారని కవిత చెప్పింది.హరీష్ రావు మీద కోపంతో జగ్గారెడ్డి పార్టీ నుండి బయిటికి వచ్చారని కవిత అన్నారు. నాకు, హరీష్ కు మా జిల్లా లో రాజకీయ శత్రుత్వం ఎప్పటికీ ఉంటుంది. అయితే నేను టీఆర్ ఎస్ వీడ‌డానికి హ‌రీశ్ రావు కార‌ణం కాదు. హరీష్ రావు కి ఈ విషయం లో సంబంధం లేదు..ఈ విషయం లో కవిత మాట్లాడిన విషయాలు తప్పు. విలువలతో కూడిన రాజకీయం చేయాలి . కేసీఆర్ కూతురు కాబట్టి కవిత నాయకురాలు అయ్యింది..కేసీఆర్ లేకపోతే కవిత లేదు. మీకు మీ కుటుంబ సభ్యులతో ఏమి అయ్యిందో మాకు తెలువదు..మమ్మల్ని మధ్యలో లాగకండి.
వైఎస్ పిలిస్తే వెళ్లాను
టీఆర్ ఎస్ నుంచి నేను కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి కారణం రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఆహ్వానిస్తేనే నేను కాంగ్రెస్ లోకి వెళ్ళాను.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధిపేట,సంగారెడ్డి మినహా ఎక్కడ టీఆర్ ఎస్‌ గెలవలేదు. కేవలం రెండు చోట్ల మాత్రమే టీఆర్ ఎస్ నేతలు గెలిచారు..అందుకే జగ్గారెడ్డి నాకు రాజకీయంగా నచ్చాడనీ రాజశేఖర్ రెడ్డి నాకు ఒక మనిషి తో చెప్పి పంపించారు..నియోజక అభివృద్ధి, ఐఐటీ ఇస్తామని చెపితే నేను అప్పుడు పార్టీ మారాను..అవగాహన ఆలోచన లేకుండా కేసీఆర్ కూతురు కవిత మాట్లాడుతున్నారు " అని జ‌గ్గారెడ్డి వివ‌రించారు

Advertisement

తాజావార్తలు

Advertisement