Doodimetla Balaraju Yadav | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రిమాండ్‌కు నిరాకరించిన కోర్టు..
Doodimetla Balaraju Yadav | బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ (Doodimetla Balaraju Yadav) రిమాండ్‌కు న్యాయస్థానం నిరాకరించింది. రూ.20 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Doodimetla Balaraju Yadav | త్రినేత్ర న్యూస్: బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ (Doodimetla Balaraju Yadav) రిమాండ్‌కు న్యాయస్థానం నిరాకరించింది. రూ.20 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాలరాజు యాదవ్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో బల్మూరి వెంకట్ భార్య ఇందుజారెడ్డి.. తన భర్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాల్‌రాజ్ యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసిన పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 11 తరువాత న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు.
ఈ క్రమంలో బాలరాజ్ యాదవ్‌పై నమోదు చేసిన 356(2), 352, 79 బీఎన్ఎస్, 3(1)(ఆర్) ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్ తదితర సెక్షన్లన్నీ ఏడేండ్ల లోపు శిక్ష పడేవేనని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఆయనను రిమాండ్‌కు (Remand Rejected) తరలించాలన్న పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. విడుదల చేయాలని ఆదేశించారు. అయితే రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేశారు
తాజావార్తలు
- ●Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..
- ●DSSSB Recruitment | DSSSBలో జూనియర్ ఇంజినీర్, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టులతో నోటిఫికేషన్
- ●Yellamma | అమ్మా తల్లీ ఎల్లమ్మ.. మా ఇంట్లో నుంచి నల్లులను బయటకు పంపించూ.. ఓ భక్తుడి విచిత్ర కోరిక
- ●Diwali 2026 Lucky Horoscope | ఈ దీపావళి ఈ 4 రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభఫలితాలు!
- ●Horoscope | నవంబర్ 7 రాశిఫలాలు.. పాత సమస్యలు మళ్లీ ఇబ్బంది పెట్టొచ్చు!
- ●Shubman Gill | ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ సిరీస్ కీలకం: గిల్

Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..

DSSSB Recruitment | DSSSBలో జూనియర్ ఇంజినీర్, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టులతో నోటిఫికేషన్

Yellamma | అమ్మా తల్లీ ఎల్లమ్మ.. మా ఇంట్లో నుంచి నల్లులను బయటకు పంపించూ.. ఓ భక్తుడి విచిత్ర కోరిక

Diwali 2026 Lucky Horoscope | ఈ దీపావళి ఈ 4 రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభఫలితాలు!






