Land Grabbed | రూ.60 కోట్ల విలువైన ఆలయ భూములు అన్యాక్రాంతం.. తహశీల్దార్ సహా 19 మందిపై కేసు
Land Grabbed | తమిళనాడులోని ప్రఖ్యాత మధుర మీనాక్షి ఆలయ భూములు ఆక్రమణకు (Land Grabbed) గురయ్యింది. అనాదిగా ఆలయానికి సంక్రమించిన రూ.60 కోట్ల విలువైన భూమిని (Temple Land) అధికారులు కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించి మార్పిడీ చేశారు.
Land Grabbed | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులోని ప్రఖ్యాత మధుర మీనాక్షి ఆలయ భూములు ఆక్రమణకు (Land Grabbed) గురయ్యింది. అనాదిగా ఆలయానికి సంక్రమించిన రూ.60 కోట్ల విలువైన భూమిని (Temple Land) అధికారులు కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించి మార్పిడీ చేశారు. దీంతో వీఆర్ఓ, తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్లు సహా 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదయింది.
మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి (Madurai Meenakshi Temple) అనుబంధంగా ఉన్న చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన 1.79 ఎకరాల భూమి మోసపూరితంగా రిజిస్ట్రేషన్లు, మార్టిగేజ్ లావాదేవీల ద్వారా కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. కోర్టు ఉత్తర్వులు, రిజిస్ట్రేషన్ చట్టాలను ఉల్లంఘించి పట్టా (Patta) బదిలీలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, తాకట్టు ఒప్పందాలు (Mortgage deeds) సృష్టించి ఆలయ ట్రస్ట్ భూమిని కాజేయడానికి 2016, జూన్ 14న అప్పటి మధురై నార్త్ తహశీల్దార్ (Tehsildar) అన్బళగన్ అధికారిక రికార్డుల నుంచి ఆలయ యాజమాన్యాన్ని తొలగించి, తొమ్మిది మంది వ్యక్తుల పేరుతో మోసపూరితంగా పట్టా బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అది వెలుగులోకి రావడంతో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) తహశీల్దార్ ఆదేశాలను రద్దు చేశారు. ఆ భూమి ఆలయ ట్రస్ట్‌కే చెందుతుందని, పట్టాను తిరిగి ఆలయం పేరుపైకి మార్చాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన కేసు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ముందుకు రావడంతో స్టే విధించింది.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, తూత్తుకుడి జిల్లా మురప్పనాడు సబ్ రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయంలో అప్పటి సబ్ రిజిస్ట్రార్ అనంతరామన్ ద్వారా 2021, ఏప్రిల్ 16న జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) రిజిస్టర్ అయింది. దాని ఆధారంగా, దిండిగల్ జిల్లా వడమదురై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటి సబ్ రిజిస్ట్రార్ ప్రశాంత్ సంతాన కరుప్పన్ ద్వారా 2021, జూలై 19న మార్టిగేజ్ (తాకట్టు) పత్రాన్ని నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ వీఆర్, తహశీల్దార్, సబ్‌రిజిస్ట్రార్లతోపాటు మరో 16 మందిపై మధురై సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాండ్ (CCB) ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. వారిపై BNSలోని 318(4) చీటింగ్, 61(2) క్రిమినల్ కుట్ర సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసింది.
తాజావార్తలు
- ●Manhole | మియాపూర్‌లో విషాదం.. మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతు
- ●Heavy Rain | ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ●Jubilee Hills CI | ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లోబర్చుకున్నాడు.. జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
- ●UP Viral Wedding | అది ఉత్తుత్తి పెండ్లి.. సోషల్ మీడియా ప్రాంక్..
- ●Horoscope | జూలై 29 రాశిఫలాలు.. మీ మాటలతో జాగ్రత్త.. లేకపోతే!
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Manhole | మియాపూర్‌లో విషాదం.. మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతు

Heavy Rain | ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు..

Jubilee Hills CI | ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లోబర్చుకున్నాడు.. జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు

UP Viral Wedding | అది ఉత్తుత్తి పెండ్లి.. సోషల్ మీడియా ప్రాంక్..



