Sabarinathan R | ఎమ్మెల్యేగా కారు డ్రైవర్ కొడుకు.. ఖతర్ టు చెన్నై.. ఎవరీ శబరీనాథన్..?
Sabarinathan R | ఆయన ఓ సాధారణ కారు డ్రైవర్ కుమారుడు.. రాజకీయాల్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించింది. గెలుపు కూడా వరించింది. తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న 30 ఏళ్ల కుర్రాడి పేరు ఆ రాష్ట్రంలో మార్మోగిపోతోంది.
Sabarinathan R | త్రినేత్ర.న్యూస్ : చట్టసభల్లో అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలి.. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం గెలిచేందుకు వందల కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి.. పడరాని పాట్లు పడ్డా కూడా ఒక్కోసారి విజయం వరించదు. అనేక పర్యాయాలు పోటీ చేసి.. కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టినా కూడా చట్టసభల్లోకి అడుగుపెట్టే అదృష్టం లభించదు. కానీ కొందరికి పోటీ చేసిన తొలిసారే అదృష్టం వరిస్తుంది.. విజయాన్ని ముద్దాడుతారు.. అసెంబ్లీలో అడుగుపెడుతారు. అలా ఎమ్మెల్యేలు అయిన వారు పదుల సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలో ఆర్ శబరీనాథన్ చేరారు.
ఎవరీ ఆర్ శబరీనాథన్ ఎవరు..?
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడే శబరీనాథన్(30). ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్న అతను.. ఖతర్‌లో కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశారు. తమిళనాడుకు తిరిగొచ్చిన శబరీనాథన్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయాలనుకున్నాడు. ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించాడు. కానీ రాజకీయాల్లోకి వస్తానన్న కుమారుడి ప్రతిపాదనను తండ్రి తిరస్కరించాడు. ఉద్యోగంలోనే కొనసాగాలని సూచించాడు. కానీ తండ్రి మాటను కాదని శబరీనాథన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.
ఊహించని విధంగా టీవీకే నుంచి టికెట్.. గెలుపు కూడా
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శబరీనాథన్‌కు టీవీకే పార్టీ నుంచి టికెట్ లభించింది. రాజధాని చెన్నైలోని విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి శబరీనాథన్‌ను విజయ్ బరిలో దింపారు. భారీ మెజార్టీతో ఒంటి చేత్తో అధికారం చేజిక్కించుకున్న విజయ్ గెలుపులో శబరీనాథన్ కూడా భాగస్వాములయ్యారు. విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై గెలుపొందారు.
ఆస్తులు కేవలం రూ. 25.7 లక్షలే
సామాన్య కుటుంబం నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టే స్థాయికి ఎదిగిన శబరీనాథన్ ఆస్తులు కేవలం రూ. 25.7 లక్షలే. సంవత్సర ఆదాయం రూ. 4.9 లక్షలే. ఇక ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసుల్లేవు. ప్రజా నేతగా తమిళ ప్రజల మనసును గెలుచుకున్నారు.
బీ ఫామ్ తీసుకున్నప్పుడు ఆనంద భాష్పాలు..

విజయ్ డ్రైవర్‌గా, ఆ తర్వాత వ్యక్తిగత సహాయకుడిగా సేవలందించిన రాజేంద్రన్‌కు కృతజ్ఞతగా.. ఆయన కుమారుడు శబరీనాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో బీ ఫామ్ తీసుకున్నప్పుడు శబరీనాథన్ తీవ్ర భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. విజయ్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నప్పుడు తండ్రి, కొడుకు ఇద్దరూ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



