WhatsApp | దారికొచ్చిన వాట్సాప్..! సీసీఐ ఆదేశాలు పాటిస్తామని సుప్రీంకోర్టుకు హామీ..!
WhatsApp | మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటా గోప్యతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర మెటా కంపెనీల డేటా పంచుకునే విషయంలో యూజర్లకు మరింత నియంత్రణ కల్పించాలంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని వాట్సాప్ సోమవారం సోమవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
WhatsApp | మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటా గోప్యతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర మెటా కంపెనీల డేటా పంచుకునే విషయంలో యూజర్లకు మరింత నియంత్రణ కల్పించాలంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని వాట్సాప్ సోమవారం సోమవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. సీసీఐ ఆదేశాలు, జరిమానాను సవాల్ చేస్తూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా ఉపసంహరించుకున్నది. సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా వాట్సాప్, మెటా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు వాదనలు వినిపించారు.
తాము ఇప్పుడు స్టే కోరడం లేదని, ఆదేశాలను అనుసరిస్తున్నామని ఆయన తెలిపారు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ఇచ్చిన ఆదేశాలను మార్చి 16 నాటికి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వాదనలను నమోదు చేసుకున్న సీజేఐ సూర్యకాంత్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం, మధ్యంతర పిటిషన్లను కొట్టివేసింది. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీతో యూజర్లపై అన్యాయమైన షరతులు విధిస్తోందని, తద్వారా మెటా తన మార్కెట్ ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకుంటోందని సీసీఐ గతంలో నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని ఎన్‌సీఎల్‌ఏటీ సమర్థించింది. అయితే, యూజర్లకు డేటా షేరింగ్‌పై స్పష్టమైన ఆప్ట్-ఇన్, ఆప్ట్-అవుట్ సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుందని, పూర్తిస్థాయి నిషేధం అవసరం లేదని చెప్పింది.
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీపై తీవ్రస్థాయిలో ఆగ్రమం వ్యక్తం చేసింది. భారతీయ చట్టాలను పాటించకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. భారతీయ యూజర్ల గోప్యతా హక్కుతో ఆడుకోవడానికి వీల్లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మధ్యంతర పిటిషన్లను వాట్సాప్ ఉపసంహరించినప్పటికీ, 2021 ప్రైవసీ పాలసీపై దాఖలైన ప్రధాన అప్పీల్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'బంగారం' సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు
- ●Ramayana | నవంబర్ 6న 'రామాయణ' విడుదల
- ●Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..
- ●N Ramchander Rao | క్రెడిట్ సీఎంకు.. బదిలీ ఆఫీసర్కా? రేవంత్‌పై రామ్‌చందర్ రావు ఫైర్
- ●టూ-ఫ్రంట్ వార్: కేటీఆర్, హరీష్‌లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ 'హిట్లర్ వ్యూహం'.. వర్కవుట్ అవుతుందా?
- ●NEET-UG | నీట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి

Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'బంగారం' సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు

Ramayana | నవంబర్ 6న 'రామాయణ' విడుదల

Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..

N Ramchander Rao | క్రెడిట్ సీఎంకు.. బదిలీ ఆఫీసర్కా? రేవంత్‌పై రామ్‌చందర్ రావు ఫైర్






