West Bengal Elections | బెంగాల్‌లో ఏం జరుగుతోంది?.. ఈసీ సాయంతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్న బీజేపీ: టీఎంసీ
West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal Elections) ఈసారి అధికార మార్పిడి పక్కా అన్ని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ జోస్యం చెప్పాయి. టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అన్న బీజేపీ (BJP,) సీఎం పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని స్పష్టం చేశాయి.
West Bengal Elections | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్‌లో (West Bengal Elections) ఈసారి అధికార మార్పిడి పక్కా అన్ని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ జోస్యం చెప్పాయి. టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అన్న బీజేపీ (BJP,) సీఎం పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ వర్గాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో అంతా విస్తుపోయే ఓ వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) విడుదల చేసింది. కోల్‌కతాలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ (Strong Room) లోపల కొందరు వ్యక్తులు బ్యాలెట్ బాక్సులు (ballot boxes) తెరిచేందుకు ప్రయత్నించారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఆరోపించింది. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు ఈసీ సహాయంతో బీజేపీ ఈ పనికి ఒడిగట్టిందని ధ్వజమెత్తింది. ఆ పార్టీ నేతలు స్ట్రాంగ్ రూమ్ ముందు ఆందోళనకు దిగారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఈ హైడ్రామా చోటుచేసుకున్నది.

ఎన్నికలు ముగిసిన తర్వాత కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఏప్రిల్ 30న సాయంత్రం 5.55 గంటల సమయంలో స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు బ్యాలెట్ బాక్సులను తెరిచి ఏదో చేస్తున్నారు. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈమేరకు ఓ వీడియోను టీఎంసీ విడుదల చేసింది. టీఎంసీ నేతలు శశి పంజా, కునాల్ ఘోష్ స్ట్రాంగ్ రూమ్ ముందు ధర్నాకు దిగారు. తమ ప్రతినిధులు లేకుండానే బాక్సులు తెరిచేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. లోపల కొందరు వ్యక్తులు పని చేస్తున్నట్లు మాకు సీసీటీవీ కెమెరాల్లో కనిపించిందని, మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదని వారు అన్నారు. అయితే టీఎంసీ ఆరోపణలను ఈసీ ఖండించింది.
అంతకుముందు, ఎగ్జిట్ పోల్స్ అంతా వట్టిదే. అవన్నీ బీజేపీ దిశానిర్దేశంతోనే నడుస్తున్నాయి. తాము 220కి పైగా సీట్లలో గెలువబోతున్నాం. అయితే, కౌంటింగ్‌లో బీజేపీ గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. టీఎంసీ కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలి. అంటూ సీఎం మమతా బెనర్జీ ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.
❗️ALARMING❗️
This is the murder of democracy in broad daylight.
CCTV footage has exposed how @BJP4India, in active collusion with the @ECISVEEP, is opening ballot boxes without the presence of any relevant party stakeholders. This is gross electoral fraud being committed openly… pic.twitter.com/aSe36kGKPI
— All India Trinamool Congress (@AITCofficial) April 30, 2026
What’s this going on inside the Strong Room?
People seen inside Netaji indoor stadium #StrongRoom in #Kolkata
Who are these people?
Time stamp on other windows read April 30, 5.55 pm#TMC releases CCTV footage claiming suspicious movement inside the strong room.
Security… pic.twitter.com/UNDSxpjY6s
— Surya Reddy (@jsuryareddy) April 30, 2026
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



