త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee | మ‌మ‌త ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చిన బెంగాల్ సీఈవో

Mamata Banerjee | ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఈవీఎంల‌ను తారుమారు చేసింద‌న్న తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి మ‌నోజ్ కుమార్ అగ‌ర్వాల్ స్పందించారు.

S

National | Published On May 4, 2026, 12.01 pm IST

Mamata Banerjee | మ‌మ‌త ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చిన బెంగాల్ సీఈవో
Advertisement

Mamata Banerjee | త్రినేత్ర‌.న్యూస్ : ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఈవీఎంల‌ను తారుమారు చేసింద‌న్న తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి మ‌నోజ్ కుమార్ అగ‌ర్వాల్ స్పందించారు. స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలు భ‌ద్రంగా ఉన్నాయ‌న్నారు. ఓట్ల‌ను దొంగ‌త‌నం చేశార‌న్న మాట ఉత్ప‌న్నమే కాద‌న్నారు. ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ ఈవీఎంల‌ను భ‌ద్ర‌ప‌రిచామ‌ని, ఈ నేప‌థ్యంలో ఓట్ల‌ను దొంగించార‌నే ప్ర‌శ్న త‌లెత్తే అవ‌కాశ‌మే లేద‌ని సీఈవో మ‌నోజ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

ఇక ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో 167 స్థానాల్లో బీజేపీ, 82 స్థానాల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ లీడ్‌లో ఉంది.

హుగ్లీలోని సెరంపుర్‌, నాడియాలోని కృష్ణానగర్‌, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్‌, కోల్‌కతాలోని క్షుదీరమ్‌ వంటి ప్రాంతాల్లో దశలవారీగా విద్యుత్‌ కోతలు జరిగినట్లు తనకు నివేదికలు వచ్చాయని మమతా ఎక్స్‌లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. సీసీటీవీలను కూడా ఆఫ్‌ చేశారని, స్ట్రాంగ్‌ రూమ్‌ ప్రాంగణంలోకి వాహనాల రాకపోకలు జ‌రిగాయ‌న్నారు. ఈ చర్యలన్నీ బీజేపీ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని ఆరోపించారు.

Advertisement
Advertisement