Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు.. తమిళనాడులో 234 సీట్లు, బెంగాల్‌లో 154 స్థానాల్లో పోలింగ్..
Assembly Elections | తమిళనాడు (Tamil Nadu) , పశ్చిమబెంగాల్‌లో (West Bengal) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Assembly Elections) ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా, బెంగాల్‌లో మొదటి దశలో (First Phase) భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది.
Assembly Elections | త్రినేత్ర.న్యూస్: తమిళనాడు (Tamil Nadu) , పశ్చిమబెంగాల్‌లో (West Bengal) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Assembly Elections) ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా, బెంగాల్‌లో మొదటి దశలో (First Phase) భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. వీటి ఫలితాలు మే 4న వెలువడుతాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మరోసారి అధికారంలోకి రావాలని విపక్షాలతో గట్టిగా పోరాడుతున్నాయి.
తమిళనాడులో..
సీఎం స్టాలిన్ (MK Stalin) వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని చూస్తుండగా, దూరమైన అధికారాన్ని బీజేపీ (BJP) అండతో తిరిగి హస్తగతం చేసుకోవాలని అన్నాడీఎంకే పోరాడుతున్నది. మరోవైపు పోటీచేస్తున్న మొదటిసారే సత్తా చాటాలని సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తహతహలాడుతున్నాడు. అయితే ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే పోటీ ఉన్నది. ప్రధాన పార్టీల గెలుపు ఓటములపై విజయ్ ప్రభావం చూపుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్నది. 4,023 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, మొత్తం 5.73 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగిచుకోనున్నారు. వీరిలో 2.93 కోట్ల మంది మహిళా ఓటర్లు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 14.59 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు. మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3,60,068 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. అదనంగా 300 పారామిలిటరీ దళాలు, 83,800కు పైగా పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
కాగా, డీఎంకే–కాంగ్రెస్ కూటమి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెల్చుకోనున్నట్లు సర్వేల్లో తేలింది. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు, విజయ్ పార్టీ 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి.

దీదీని మోదీ అడ్డుకుంటారా..
గత ఎన్నికల్లో అనూహ్యంగా బలం పెంచుకున్న బీజేపీ.. ఈసారి ఎలాగైనా దీదీని (Mamata Banerjee) అధికారానికి దూరం చేయాలని పట్టుదలతో ఉన్నది. మోదీపై (PM Modi) విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలని మమతా బెనర్జీ తన సర్వశక్తులను ఒడ్డుతున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం తొలి దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్నది. 16 జిల్లాల్లో మొత్తం 3,60,77,171 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,84,99,496 మంది పురుషులు, 1,75,77,210 మంది మహిళలు, 465 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని వీరు తేల్చనున్నారు.
ఎన్నికలు జరిగే జిల్లాలు..
డార్జిలింగ్, జల్పాయిగురి, కూచ్ బేహార్, జంగల్ మహల్, పురులియా, బాంకురా, పశ్చిమ మేదినిపూర్, బీర్బూమ్, ముర్షిదాబాద్
సర్ ప్రభావం..
బెంగాల్ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపే అంశం ఏదైనా ఉందంటే అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR). దీనికారణంగా 91 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఇవి సుమారు 12 శాతం. ఒక్క ముర్షిదాబాద్ జిల్లాలోనే 7.48 లక్షల ఓట్లను తొలగించారు. నడియాలో 4.85 లక్షలు, మాల్దా 4.59 లక్షలు, ఉత్తర్ దినాజ్‌పూర్ 3.63 లక్షలు, కూచ్ బెహార్ 2.42లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. ప్రస్తుతం ఇదే అంశం ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారింది.
#WATCH | West Bengal Elections 2026 | Long queues of voters formed outside a polling station in Birbhum as polling for the first phase of State Assembly elections begins. pic.twitter.com/3g0WBwSV6L
— ANI (@ANI) April 23, 2026
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

PM Modi | UAE క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్‌ను కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



