Tamil Nadu | విరుదునగర్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం..!
Tamil Nadu | విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణాసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందినట్లుగా సమాచారం.
Tamil Nadu | విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణాసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను అధికారికంగా తెలిపారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య క్రమంగా పెరిగితే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో వనజా బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఉలిక్కిపడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే, పేలుడు తీవ్రత కారణంగా ఫ్యాక్టరీలోని నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాణాసంచా తయారీకి విరుదునగర్ జిల్లా ప్రసిద్ధి. శివకాశి, సత్తూరు ప్రాంతాలు ఈ పరిశ్రమకు కేంద్రంగా ఉన్నాయి. అయితే, ఇక్కడ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీల్లో గతంలోనూ పేలుళ్లు జరిగాయి. అయితే, అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి.
VIDEO | Virudhunagar, Tamil Nadu: Several feared dead in a firecracker factory blast near Kattanarpatti. pic.twitter.com/FLJBiukUtG
— Press Trust of India (@PTI_News) April 19, 2026
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



