త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay’s TVK | టీవీకే విజ‌య్ స‌భ‌కు ఎట్ట‌కేల‌కు అనుమ‌తి.. ష‌ర‌తులు విధించిన పోలీసులు..!

Vijay's TVK | త‌మిళ‌గ వెట్రి కజగం (టీవీకే) నేత‌, న‌టుడు విజయ్ ఈ నెల 13న సేలం జిల్లాలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన స‌భ‌కు పోలీసులు ఎట్ట‌కేల‌కు అనుమ‌తి ఇచ్చారు. తలముత్తు నటరాజన్ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్న స‌భ‌కు ప‌లు ష‌ర‌తులు విధించారు.

P

National | Published On Feb 8, 2026, 8.20 pm IST

Vijay’s TVK | టీవీకే విజ‌య్ స‌భ‌కు ఎట్ట‌కేల‌కు అనుమ‌తి.. ష‌ర‌తులు విధించిన పోలీసులు..!
Advertisement

Vijay's TVK | త‌మిళ‌గ వెట్రి కజగం (టీవీకే) నేత‌, న‌టుడు విజయ్ ఈ నెల 13న సేలం జిల్లాలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన స‌భ‌కు పోలీసులు ఎట్ట‌కేల‌కు అనుమ‌తి ఇచ్చారు. తలముత్తు నటరాజన్ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్న స‌భ‌కు ప‌లు ష‌ర‌తులు విధించారు. వేదిక ఎంపిక, అధికారుల సూచ‌న‌లు పాటించే విష‌యంలో టీవీకే పార్టీ, పోలీసుల మ‌ధ్య ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు, సంప్ర‌దింపులు జ‌రిగాయి. గ‌త‌వారంలో కేంద్ర జిల్లా కార్య‌ద‌ర్శి త‌మిళ‌న్ ఏ పార్థిబ‌న్ నేతృత్వంలో టీవీకే నిర్వాహ‌కులు స్టేడియం నేత‌లు స్టేడియంలో సమావేశం నిర్వహించడానికి అనుమతి కోరుతూ సేలం నగర పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ గిరిని సంప్రదించారు. అయితే, ప్రభుత్వ మార్గదర్శకాల మేర‌కు అవసరమైన కొన్ని విధానపరమైన వివరాలు స్పష్టంగా పేర్కొనలేదని అధికారులు గుర్తించి ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించారు. ఆ త‌ర్వాత కార్తి మాగుడంచావ‌డి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మ‌రోసారి ద‌ర‌ఖాస్తు చేసి కాలికావుండంపాల‌యంలో విజ‌య్ స‌భ‌కు అనుమ‌తి కోరారు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ సీపీ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తును స‌వ‌రించి ద‌ర‌ఖాస్తు చేశారు. నిబంధ‌న‌లు పాటిస్తామ‌ని హామీ ఇచ్చారు. స‌భ‌కు హాజ‌ర‌య్యే వారిని 5వేల‌కు ప‌రిమితం చేస్తామ‌ని, ర‌ద్దీని నివారించేందుకు, శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో స‌భ‌కు వ‌చ్చేవారి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. దాంతో పోలీసుల‌కు అనుమ‌తులు మంజూరు చేశారు. అనుమతించిన సంఖ్య కంటే జనం ఎక్కువగా రాకుండా చూసేందుకు టోకెన్ విధానం ద్వారా వేదికలోకి ప్రవేశాన్ని నియంత్రించాల‌ని, స్టేడియం చుట్టూ భద్రత, అత్యవసరంగా స్పందించేందుకు, ట్రాఫిక్ నియంత్రణ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు పోలీసులు ఆదేశించారు. పిల్ల‌లు, గ‌ర్భిణులను స‌భ‌కు హాజ‌రుకాకుండా చూడాల‌ని చెప్పారు. 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే అనుమ‌తి ఇవ్వ‌గా.. నిర్ణీత స‌మ‌యంలోనే స‌భ నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. త్వ‌ర‌లో త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో విజ‌య్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేశారు.

Advertisement
Advertisement