Vijay Mallya | భారత్‌పై వ్యంగ్యంగా కామెంట్లు చేసిన లలిత్ మోదీ, విజయ్ మాల్యా.. మండిపడుతున్న నెటిజన్లు..
Vijay Mallya | భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన ఆర్థిక నేరస్థులు విజయ్ మాల్యా, లలిత్ మోదీ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి వారు ఇద్దరూ కలిసి భారత్‌పై వ్యంగ్యంగా కామెంట్లు చేస్తూ వీడియోలో కనిపించారు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vijay Mallya | భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన ఆర్థిక నేరస్థులు విజయ్ మాల్యా, లలిత్ మోదీ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి వారు ఇద్దరూ కలిసి భారత్‌పై వ్యంగ్యంగా కామెంట్లు చేస్తూ వీడియోలో కనిపించారు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్‌లో విజయ్ మాల్యా కోసం మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ బర్త్ డే పార్టీ నిర్వహించగా అందులో లలిత్ మోదీతోపాటు విజయ్‌మాల్యా కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి భారత్‌పై చేసిన కామెంట్లు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. బర్త్ డే పార్టీ సందర్భంగా ఆ ఇద్దరూ కలిసి మాట్లాడుతూ.. భారత్ నుంచి పరారీలో ఉన్న అతి పెద్ద నేరగాళ్లము మేమిద్దరమే.. అని అన్నారు. దీంతో వారి కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.
తమ వీడియోను లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. భారత్‌లో మరోసారి ఇంటర్నెట్‌ను బ్రేక్ చేద్దాం, ఇది మీడియా వాళ్ల కోసమే, మీకు అసూయ కలగాలని కోరుకుంటున్నా.. అని ఆ పోస్టుకు లలిత్ మోదీ క్యాప్షన్ పెట్టడం నెటిజన్లను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. దీంతో వారు ఆ ఇద్దరినీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. భారత్‌ను ఆ ఇద్దరూ అంత ఘోరంగా అవమానించేలా మాట్లాడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు, వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి, ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని ఇంకా భారత్‌కు ఎందుకు రప్పించడం లేదు, వారు ఇద్దరూ ఈడీ, సీబీఐల గురించే మాట్లాడుతున్నారు.. అని నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
కాగా అప్పట్లో ఐపీఎల్ చైర్మన్ గా పనిచేసిన లలిత్ మోదీ 2009లో ఐపీఎల్ ప్రసార హక్కులను కేటాయించడంలో అవకతవకలకు పాల్పడి రూ.125 కోట్లు పొందాడని, అలాగే పన్నులు ఎగ్గొట్టడం, మనీ లాండరింగ్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని అతనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను చేసిన స్కాంలు బయట పడే సమయానికి అప్పటికే అతను 2010లో భారత్ నుంచి పారిపోయాడు. ఇక మరో ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా దేశంలోని బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి అనంతరం లండన్‌కు పారిపోయాడు. దీంతో అతన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఈడీ, సీబీఐ వంటి సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మాల్యాను 2019లో స్పెషల్ కోర్టు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) ప్రకారం పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. దీన్ని మాల్యా సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా వేశాడు. ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణలో ఉంది.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Govind Mohan | దేశంలో స్వదేశీ ఉగ్రవాదం దాదాపు అంతమైపోయింది : హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్
అక్టోబర్ 17, 2026

UN | యువశక్తి దేశంపై ఇంతటి నిరాధారమైన ఆరోపణలా..? ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం
అక్టోబర్ 17, 2026

US Sanctions | రష్యాపై ఆంక్షలు ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట!
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..
- ●Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం
- ●FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!
- ●Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..

Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం

FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!

Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...



