త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay | శాస‌న‌స‌భ‌ప‌క్ష నేత‌గా విజ‌య్‌.. ఈ నెల 7న సీఎంగా ప్ర‌మాణం.?

Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో 108 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచి టీవీకే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ద్రావిడ రాజకీయాల పితామహుడు సీఎన్ అన్నాదురైకి విజ‌య్ నివాళులు అర్పించారు.

P

National | Published On May 5, 2026, 3.48 pm IST

Vijay | శాస‌న‌స‌భ‌ప‌క్ష నేత‌గా విజ‌య్‌.. ఈ నెల 7న సీఎంగా ప్ర‌మాణం.?
Advertisement

Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో 108 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచి టీవీకే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ద్రావిడ రాజకీయాల పితామహుడు సీఎన్ అన్నాదురైకి విజ‌య్ నివాళులు అర్పించారు. చెన్నై సమీపంలోని పనయూరులో ఉన్న పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో విజయ్‌ను ఏకగ్రీవంగా శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నుకున్నారు. మ‌రో వైపు విజ‌య్ ప్ర‌భుత్వం ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో ఈ నెల 7న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు బుధ‌వారం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి కోరున్న‌ట్లు స‌మాచారం. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం విజ‌య్ లేఖ సైతం రాసిన విష‌యం తెలిసిందే.

అయితే, ప్ర‌భుత్వ ఏర్పాటుకు టీవీకే ప‌ది సీట్ల దూరంలో నిలిచింది. అయితే, భేటీలో పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రాజకీయాల్లో స్వాభిమానం విష‌యంలో ఏమాత్రం రాజీపడబోమని పార్టీ వ‌ర్గాలు స్పష్టం చేశాయి. ఏ రాజకీయ పార్టీ వద్దకూ మద్దతు కోసం వెళ్ల‌కూడ‌ద‌నే అభిప్రాయానికి నేత‌లు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. తొలిసారిగా పోటీ చేసిన ఎన్నిక‌ల్లోనే టీవీకే అత్య‌త్తుమ ప్ర‌ద‌ర్శ‌న చేసిన రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క శ‌క్తిగా అవ‌త‌రించింది. 234 స్థానాల అసెంబ్లీలో ఈ పార్టీ 108 స్థానాలు విజ‌య ఢంకా మోగించింది. ప్ర‌భుత్వం ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్ 118కి ప‌ది సీట్ల దూరంలోనే ఆగిపోయింది. పార్టీ అధినేత విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు.

ఈ ఎన్నికలతో తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి విజ‌య్ స‌వాల్ విసిరారు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలే మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని భావించ‌గా.. టీవీకే ఎంట్రీతో స‌మీక‌ర‌ణాల‌న్ని త‌ల‌కిందుల‌య్యాయి. ఇదిలా ఉండ‌గా.. విజ‌య్ ప్ర‌స్తుతం శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎంపికైన నేప‌థ్యంలో త‌ర్వాది ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేదానిపై ఆస‌క్తి నెల‌కొంది. ఇత‌ర పార్టీల‌తో క‌లిసి కూట‌మిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేదంటే బ‌య‌టి నుంచే మ‌ద్ద‌తు తీసుకుంటుందా ? స‌్వ‌తంత్రంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుందా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, అధికార డీఎంకే పార్టీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సీఎం ఎంకే స్టాలిన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌వ‌ర్న‌ర్‌కు రాజీనామా స‌మ‌ర్పించ‌డంతో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకు మార్గం సుగ‌మ‌మైంది.

Advertisement
Advertisement