త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BKTC | బ‌ద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆల‌యాల్లో హిందుయేత‌రుల‌కు ప్ర‌వేశం నిషేధం..!

BKTC | బ‌ద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆల‌యాల‌తో పాటు బీకేటీ ప‌రిధిలోని ఇత‌ర ఆల‌యాల్లోనూ హిందుయేత‌రుల‌కు ప్ర‌వేశాన్ని నిషేధించ‌నున్నారు. ఈ మేర‌కు బ‌ద్రీనాథ్ కేదార్‌నాథ్ టెంపుల్ క‌మిటీ త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న బోర్డు స‌మావేశంలో తీర్మాని ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించ‌నున్న‌ది.

P

National | Published On Jan 26, 2026, 3.30 pm IST

BKTC | బ‌ద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆల‌యాల్లో హిందుయేత‌రుల‌కు ప్ర‌వేశం నిషేధం..!
Advertisement
  • త్వ‌ర‌లో టెంపుల్ క‌మిటీ బోర్డు స‌మావేశంలో తీర్మానం
  • - బీకేటీసీ అధ్య‌క్షుడు హేమంత్ ద్వివేది

BKTC | బ‌ద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆల‌యాల‌తో పాటు బీకేటీ ప‌రిధిలోని ఇత‌ర ఆల‌యాల్లోనూ హిందుయేత‌రుల‌కు ప్ర‌వేశాన్ని నిషేధించ‌నున్నారు. ఈ మేర‌కు బ‌ద్రీనాథ్ కేదార్‌నాథ్ టెంపుల్ క‌మిటీ త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న బోర్డు స‌మావేశంలో తీర్మాని ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించ‌నున్న‌ది. బీకేటీసీ అధ్య‌క్షుడు హేమంత్ ద్వివేది మాట్లాడుతూ.. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ధామ్‌తో సహా ఆలయ కమిటీ పరిధిలోని అన్ని ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశం నిషేధం విధిస్తామ‌న్నారు. ఈ మేర‌కు రాబోయే స‌మావేశంలో ఆల‌య క‌మిటీ తీర్మానాన్ని ఆమోదిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. దేవ‌భూమి సంస్కృతి, సంప‌ద్రాయాల‌ను ప‌రిర‌క్షించ‌డం ముఖ్య‌మ‌న్నారు. సాంప్ర‌దాయ‌కంగా కేదార్ ఖండ్ నుంచి మాన‌స్ ఖండ్ వ‌ర‌కు ఉన్న ఆల‌యాల స‌ముదాయంలోకి హిందూయేత‌రులకు ప్ర‌వేశం నిషేధించార‌ని.. కానీ బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల హ‌యాంలో ఈ సంప్ర‌దాయాన్ని ఉల్లంఘించార‌న్నారు. ఇక‌పై సంప్రదాయాలను సక్రమంగా పాటించేలా చూసేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామ‌న్నారు.

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మించిన మ‌త‌ప‌ర‌మైన క‌ట్ట‌డాల‌ను తొల‌గించ‌డాన్ని ఆయ‌న స్వాగ‌తించారు. ఈ చ‌ర్య ఉత్త‌రాఖండ్ గుర్తింపు, సాంస్కృతిక వార‌స‌త్వం, శాంతిభ‌ద్ర‌త‌ల‌ను బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క‌మైంద‌న్నారు. యూసీసీ అమలు, ప్రజల ప్రభుత్వం, కఠినమైన నకిలీ నిరోధక చట్టాలు, అంకితా భండారి కేసులో సీబీఐ విచారణకు సిఫార‌సు చేయ‌డం వంటి చ‌ర్య‌లు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పెంచాయ‌ని హేమంత్ ద్వివేది తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, ఆల‌య క‌మిటీ మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో దేవ‌భూమి ప‌విత్ర‌త‌, సంప్ర‌దాయాల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌రిర‌క్షించ‌గ‌ల‌మ‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ దిశ‌గా ఆల‌య క‌మిటీ స‌మ‌ర్థ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement