Kiran Rijuju | దేశ భద్రతకు రాహుల్ చాలా ప్రమాదకరం : కిరణ్ రిజుజు
Kiran Rijuju | కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి (Union Minister) కిరణ్ రిజిజు (Kiren Rijiju) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.
Kiran Rijuju | కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి (Union Minister) కిరణ్ రిజిజు (Kiren Rijiju) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేతకు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దేశ భద్రతకు (national security) ఆయన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ రిజుజు ఈ ఆరోపణలు చేశారు. “ప్రతిపక్ష నేత రాహుల్‌కు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన నక్సలైట్లు, తీవ్రవాదులు, సిద్ధాంతకర్తలు, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జిసోరస్ వంటి వ్యక్తులతో సమావేశమవుతాడు. దేశ వ్యతిరేక శక్తులతో సావాసం చేస్తూ రాహుల్ జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారాడు” అంటూ కిరణ్ రిజుజు ఆరోపణలు చేశారు.
ట్రేడ్ డీల్ సందర్భంగా ట్రంప్‌కు మోదీ ప్రభుత్వం తలొగ్గిందంటూ రాహుల్ లోక్‌సభలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తన వ్యాఖ్యలతో దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు కోరుతూ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాహుల్‌పై కిరణ్ రిజుజు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






