త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Speed Rail Corridors | బ‌డ్జెట్‌లో హైద‌రాబాద్‌కు వ‌రాలు.. ఈ మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్లు..!

P

National | Published On Feb 1, 2026, 11.49 am IST

High Speed Rail Corridors | బ‌డ్జెట్‌లో హైద‌రాబాద్‌కు వ‌రాలు.. ఈ మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్లు..!
Advertisement

High Speed Rail Corridors | కేంద్ర బ‌డ్జెట్‌లో హైద‌రాబాద్‌పై కేంద్రం వ‌రాల జ‌ల్లు కురిపించింది. దేశంలో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్‌ల‌ను నిర్మించ‌నున్న‌ట్లు కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ప్ర‌క‌టించారు. ముంబ‌యి-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మార్గాల్లో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. అలాగే, రాబోయే ఐదేళ్ల‌లో 20 కొత్త జ‌ల‌మార్గాల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. వారణాసి, పాట్నాలో నౌకల మరమ్మతు ఫెలిసిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెలిపారు. సీప్లేన్ వీజీఎఫ్ పథకం ప్రారంభిస్తామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా.. నేష‌న‌ల్ ఫైబ‌ర్ ప్ర‌ణాళిక కింద ప‌ట్టు, జ‌న‌ప‌నార‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉపాధిని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. చేనేత మిషన్ ద్వారా ప్రోత్సాహకాలు కూడా అందించ‌నున్న‌ట్లు తెలిపారు. సమర్థ్-2.0 ద్వారా ఈ రంగాన్ని ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామ‌న్నారు. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ కింద చేనేత, హస్తకళలకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. గ్రామాలను, వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ (ODOP) ఇన్నోవేష‌న్‌, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతను ప్రోత్స‌హిస్తుంద‌న్నారు.

క్రీడా వస్తువుల తయారీ, ఆవిష్కరణ, పరిశోధనలపై ప్రాధాన్యత ఇవ్వున్న‌ట్లు తెలిపారు. 200 లెగసీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఎంఎస్ఎంఈలు సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల కోసం రూ.10వేల‌కోట్ల డెవ‌ల‌ప్‌మెంట్ నిధిని ప్ర‌తిపాదించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ నిధికి రూ.2,000 కోట్ల టాప్-అప్ ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు తెలిపారు. టైర్-2 మరియు టైర్-3 పట్టణాలలో కార్పొరేట్ మిత్రాల‌ను స్థాపించ‌నున్న‌ట్లు తెలిపారు. ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న టైర్-2, టైర్-3 పట్టణాలపై అభివృద్ధి దృష్టి సారించ‌నున్న‌ట్లు తెలిపారు. రుణాలకు పాక్షికంగా హామీ ఇవ్వడానికి మౌలిక సదుపాయాల రిస్క్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తార‌న్నారు.

Advertisement
Advertisement