Kerala Election Results | కేరళంలో విజయం దిశగా యూడీఎఫ్..
Kerala Election Results | కేరళం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సంపూర్ణమైన ఆధిక్యం సాధిస్తూ ముందుకు సాగుతోంది. 140 సభ్యుల అసెంబ్లీలో యూడీఎఫ్ 95 స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉన్నట్లు ట్రెండ్స్ పేర్కొంటున్నాయి.
Kerala Election Results | కేరళం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సంపూర్ణమైన ఆధిక్యం సాధిస్తూ ముందుకు సాగుతోంది. 140 సభ్యుల అసెంబ్లీలో యూడీఎఫ్ 95 స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉన్నట్లు ట్రెండ్స్ పేర్కొంటున్నాయి. ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే.. 2001 అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారీ విజయం దక్కనుంది. ఆ ఎన్నికల్లో యూడీఎఫ్ 99 స్థానాలు గెలిచి చరిత్రలోనే భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వెనుకంజలో ఉన్నది. కీలక నియోజకవర్గాల్లో ఎల్డీఎఫ్ భారీ పరాజయాన్ని మూటగట్టుకునే అవకాశాలున్నది.
35 స్థానాల్లో ఎల్‌డీఎఫ్ కూటమి..
ప్రస్తుతం ఎల్‌డీఎఫ్ కూటమి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో సాధించిన 99 స్థానాలో పోలిస్తే భారీగా వెనుకపడింది. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికలపై దృష్టి సారించింది. అధికారాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్ ప్రదర్శనలు నిర్వహించింది. ఎల్‌డీఎఫ్ బలంగా ఉన్న ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. సెంట్రల్, నార్త్ కేరళలో ఓటు బ్యాంకును మరింత పెంచుకొని విజయం దిశగా ముందుకు సాగుతోంది. ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాల మద్దతుతో పాటు పాలన, సంక్షేమ పథకాలు, ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టి ప్రచారం చేపట్టింది.
యూడీఎఫ్‌కు 2001 తర్వాత..
కేరళ రాజకీయ చరిత్రలో యూడీఎఫ్‌కు 2001 ఎన్నికలే అత్యుత్తమంగా ఎన్నికలుగా నిలిచాయి. ఆ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచింది. అనంతరం 2006లో ఎల్డీఎఫ్ 98 స్థానాలతో అధికారంలోకి వచ్చి, యూడీఎఫ్‌ను 42 స్థానాలకు పరిమితం చేసింది. 2011లో ఉత్కంఠభరిత పోరులో యూడీఎఫ్ 72 స్థానాలతో స్వల్ప ఆధిక్యంతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఎల్డీఎఫ్ 68 స్థానాలు సాధించింది. 2016లో ఎల్డీఎఫ్ మళ్లీ అధికారంలోకి వచ్చి 91 స్థానాలు గెలుచుకుంది. యూడీఎఫ్ 47 స్థానాలకు పడిపోయింది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కష్టకాలాన్ని ఎదుర్కొంది. 2021లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి 99 స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికలకు ముందు కేరళలో ఐదేళ్లకొకసారి ప్రభుత్వం మారుతూ వచ్చే సంప్రదాయానికి విజయ్ చెక్ పెట్టారు. ఆ సమయంలో యూడీఎఫ్ వరుసగా రెండోసారి ఓటమిని చవిచూసి 41 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే ఈ సారి యూడీఎఫ్ కూటమి బలంగా పునరాగమనం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






