Guruvayur Temple | ఉదయాస్తమాన పూజ యథావిధిగా జరగాల్సిందే.. సుప్రీంకోర్టు ఆదేశం
Guruvayur Temple | కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఉదయాస్తమాన పూజను ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారమే నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వృశ్చిక నెల (కేరళ మాసం) ఏకాదశి రోజునే ఈ పూజ నిర్వహించాలని స్పష్టం చేసింది.
Guruvayur Temple | కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఉదయాస్తమాన పూజను ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారమే నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వృశ్చిక నెల (కేరళ మాసం) ఏకాదశి (వృశ్చిక శుక్ల పక్ష ఏకాదశి) రోజునే ఈ పూజ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆలయ నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందుల కంటే భక్తుల విశ్వాసాలు, మనోభావాలకే ప్రాధాన్యత ఇవ్వాలని జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
ఉదయాస్తమాన పూజను వృశ్చికం ఏకాదశి రోజున నిర్వహించడాన్ని మార్చేందుకు గురువాయూర్ దేవస్వం మేనేజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ పీసీ హరి, సంప్రదాయ నిర్వహణ కుటుంబాల సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గురు కృష్ణకుమార్ వాదనలు వినిపించారు. వృశ్చికం ఏకాదశి రోజున భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పూజ నిర్వహణలో సమస్యలు ఎదురవుతున్నాయని ఆలయ యాజమాన్యం తరఫు న్యాయవాదులు సీఏ సుందరం, వీ గిరి, రోహిణి మూసా కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ కుమార్.. తాను కూడా ఒకసారి ఏడు గంటల పాటు నిలబడ్డానని, అది భక్తి భావంలో భాగమేనని వ్యాఖ్యానించారు. 2023 వరకు ఉదయాస్తమాన పూజను వృశ్చికం ఏకాదశి రోజునే నిర్వహించేవారని పిటిషనర్లు తెలిపారు.
అయితే, 2024, 2025లో మాత్రమే ఈ సంప్రదాయాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. ఉదయాస్తమాన పూజ ఆలయ సంప్రదాయంలో అత్యంత కీలకమైనదని, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జరిగే ఈ పూజలో సుమారు 15–18 పూజలు ఉంటాయని వివరించారు. గతంలో కేరళ హైకోర్టు తమ పిటిషన్లను కొట్టివేయడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది అక్టోబర్‌లోనూ సుప్రీంకోర్టు ఇదే అంశంపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసి, నవంబర్‌లో వచ్చిన వృశ్చికం ఏకాదశి రోజున పూజ నిర్వహించేందుకు అనుమతించింది. తాజాగా ఈ అప్పీల్‌పై డిసెంబర్‌లో తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!





