Terrorists | ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం
Terrorists | జమ్మూకశ్మీర్ కిష్టావర్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. త్రాషి-1 ఆపరేషన్‌లో భాగంగా పాసర్‌కుత్ ఏరియాలో ఆపరేషన్ నిర్వహించగా, ఇద్దరు ఉగ్రవాదులు తారసపడ్డారు.
Terrorists | త్రినేత్ర.న్యూస్ : జమ్మూకశ్మీర్ కిష్టావర్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. త్రాషి-1 ఆపరేషన్‌లో భాగంగా పాసర్‌కుత్ ఏరియాలో ఆపరేషన్ నిర్వహించగా, ఇద్దరు ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో వారిని బలగాలు కాల్చిచంపారు. ఘటనాస్థలి నుంచి రెండు ఏకే47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పాసర్‌కుత్ ఏరియాలో తలదాచుకున్నట్లు బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దాంతో అక్కడ కూంబింగ్ నిర్వహించి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కాల్పులు జరిపి వారిని అంతమొందించారు.
హతమైన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్ జాతీయులు అని పోలీసులు తేల్చారు. వీరిద్దరు నిషేధిత జైషే మహమ్మద్ టెర్రరిస్టు సంస్థకు చెందిన సభ్యులు అని నిర్ధారించారు. ఉగ్రవాదులు స్థానికంగా ఉన్న కొండ దిగువన ఒక మట్టి ఇంటిలో దాక్కున్నట్లు సమాచారం అందింది. దాంతో కూంబింగ్ నిర్వహించి వారిని మట్టుబెట్టినట్టు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారికి ఆశ్రయమిచ్చే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చారు.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



