త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay | బంగారం, సిల్క్ చీర‌..! మ‌హిళా ఓట‌ర్ల‌కు టీవీకే విజ‌య్ వ‌రాలు..!

TVK Vijay | త్వ‌ర‌లో త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానున్న‌ది. ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీలో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. వారిపై వ‌రాల వాన కురిపిస్తున్నాయి.

P

National | Published On Mar 7, 2026, 7.37 pm IST

TVK Vijay | బంగారం, సిల్క్ చీర‌..! మ‌హిళా ఓట‌ర్ల‌కు టీవీకే విజ‌య్ వ‌రాలు..!
Advertisement

TVK Vijay | త్వ‌ర‌లో త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానున్న‌ది. ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీలో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. వారిపై వ‌రాల వాన కురిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ సైతం మ‌హిళా ఓట‌ర్ల‌కు ప‌లు హామీలు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధించి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే.. 60 ఏళ్లు దాటిన మ‌హిళ‌ల‌కు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. అర్హులైన యువ‌తుల వివాహానికి 8 గ్రాముల బంగారం, సిల్క్ చీరెలు అంద‌జేయ‌నున్న‌ట్లు హామీ ఇచ్చారు. మ‌హిళ‌లు అన్ని ప్ర‌భుత్వ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేసేలా అవ‌కాశం క‌ల్పిస్తాన‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. మ‌హిళ‌ల‌పై జ‌రిగే నేరాల‌ను టీవీకే ప్ర‌భుత్వం స‌హించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం రాష్ట్ర పోలీస్‌శాఖ‌లో ప్ర‌త్యేక యూనిట్‌ణు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే, రాణి వెలు నాచి యార్ యూనిట్‌ను సైతం రూపొందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచి, మహిళలపై జరిగిన నేరాల‌కు సంబంధించిన కేసుల విచార‌ణ‌ను వేగ‌వంతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళల భద్రత కోసం స్మార్ట్ పానిక్ బటన్‌లను ఏర్పాటు చేస్తారని, అలాగే రేషన్ షాపులు, స్కూల్స్‌, కాలేజీల ద్వారా ఉచిత సానిటరీ ప్యాడ్లను అందిస్తారని విజయ్ తెలిపారు. ఏడాదికి ఆరు ఉచితంగా వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను అందించేందుకు అన్నపూర్ణి సూప‌ర్ సిక్స్ స్కీమ్‌, అలాగే కామ‌రాజ‌ర్ క‌ల్వి ఊరుతి తిత్తం ద్వారా ఏడాదికి రూ.15వేల స‌హాయం, మ‌హిళ‌ల స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాలు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement