త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay | స్వ‌తంత్ర అభ్య‌ర్థికి విజ‌య్ మ‌ద్ద‌తు.. ఎడ‌ప్పాడిలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం..!

TVK Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ ఆధ్వర్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

P

National | Published On Apr 19, 2026, 9.30 pm IST

TVK Vijay | స్వ‌తంత్ర అభ్య‌ర్థికి విజ‌య్ మ‌ద్ద‌తు.. ఎడ‌ప్పాడిలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం..!
Advertisement

TVK Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ ఆధ్వర్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ పార్టీ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి వైపు మొగ్గు చూపింది. టీవీకే తరఫున దాఖలైన నామినేషన్‌ను పరిశీలించిన ఎన్నికల అధికారులు సాంకేతిక కారణాలతో తిర‌స్క‌రించారు. దాంతో పార్టీ వర్గాల్లో నిరుత్సాహం నెలకొంది. ఈ పరిస్థితిలో పార్టీ అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకుని, అదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమ్‌కుమార్‌కు మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్ర‌క‌టించారు. ప్రేమ్‌కుమార్ తనకు సన్నిహితుడు మాత్రమే కాకుండా, అభిమాన సంఘంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని విజయ్ పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయనకు పూర్తి సహకారం అందించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. ఎడప్పాడి నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు అందరూ ప్రేమ్‌కుమార్‌కు కేటాయించిన ‘టెలివిజన్’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. టీవీకే అభ్యర్థి పోటీకి దూరమైనప్పటికీ, ప్రేమ్‌కుమార్‌ను పార్టీ ప్రతినిధిగానే భావించాలని విజయ్ స్పష్టం చేశారు. ఆయన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. పార్టీ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తున్న శక్తులకు ఈ విజయం సమాధానంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకేకు చెందిన సీనియర్ నేత ఎడప్పాడి కే పళనిస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీవీకే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలోకి దిగడంతో ఎన్నికల పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

Advertisement
Advertisement