త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AAP | ట్రంప్ భార‌త‌దేశ విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీస్తున్నా.. నోరుమెద‌ప‌ని మోదీ: ఆప్ ఆగ్ర‌హం

AAP | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అంత‌ర్జాతీయ వేధిక‌ల‌పై భార‌త్‌ను అదేప‌నిగా అవ‌మానిస్తున్నా ప్ర‌ధాని మోదీ (Narendra Modi) నోరు మెద‌ప‌డం లేద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

G

National | Published On Feb 21, 2026, 7.35 am IST

AAP | ట్రంప్ భార‌త‌దేశ విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీస్తున్నా.. నోరుమెద‌ప‌ని మోదీ: ఆప్ ఆగ్ర‌హం
Advertisement

AAP | త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అంత‌ర్జాతీయ వేధిక‌ల‌పై భార‌త్‌ను అదేప‌నిగా అవ‌మానిస్తున్నా ప్ర‌ధాని మోదీ (Narendra Modi) నోరు మెద‌ప‌డం లేద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భార‌త్‌-పాక్ రెండు దేశాల మ‌ధ్య యుద్ధాన్ని తానే ఆపాన‌ని, ఇరు దేశాలు వెన‌క్కి త‌గ్గ‌క‌పోతే 200 శాతం టారిఫ్‌లు విధిస్తాని హెచ్చ‌రించాన‌ని ట్రంప్‌ మ‌రోసారి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌న‌ టారిఫ్ హెచ్చ‌రిక‌ల‌తోనే యుద్ధం ముగించిన‌ట్లు బోర్డ్ ఆఫ్ పీస్ ఈవెంట్‌లో వెల్ల‌డించారు. ఆ యుద్ధ స‌మ‌యంలో 11 ఫైట‌ర్ జెట్స్‌ కూలిపోయాయి. అందులో చాలా ఖ‌రీదైన జెట్స్ ఉన్నాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ కూడా పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఆర్థిక ప‌ర‌మైన ఒత్తిడి చేయ‌డం వ‌ల్లే సైనిక ఘ‌ర్ష‌ణ‌ను ప్ర‌ధాని మోదీ ఆపార‌ని అంత‌ర్జాతీయ వేదిక ట్రంప్ ప్ర‌క‌టించ‌డం ద్వారా భార‌త్‌ను బ‌హిరంగా అవ‌మానించార‌ని ఆప్ పేర్కొంది. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న పాక్ ప్ర‌ధాని న‌వ్వుతూ క‌నిపించార‌ని తెలిపారు. ప్ర‌పంచ వేదిక‌పై భార‌తదేశ విశ్వ‌స‌నీయ‌త‌ను ట్రంప్ ప‌దేప‌దే ప్ర‌శ్నిస్తున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ మోదీ మౌనం వీడ‌టం లేద‌ని విమ‌ర్శించింది. నిజ‌మైన దేశ‌భ‌క్తుడు భార‌త్‌ను అవ‌మానించ‌డాన్ని ఎలా స‌హించ‌స్తాడ‌ని దేశ ప్ర‌జ‌లు అడుగుతున్నార‌ని వ్యాఖ్యానించింది.

గ‌తేడాది మే నుంచి ట్రంప్ 100 సార్లకుపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిఉంటారు. పాక్‌-భారత్‌ మధ్య యుద్ధం తానే ఆపానంటూ ప్రపంచ వేదికగా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో భారత్‌ మాత్రం మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. స్వయంగా ప్రధానే ఈ విషయాన్ని చెప్పినప్పటికీ.. ట్రంప్‌ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకచోట భారత్‌-పాక్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

https://x.com/AamAadmiParty/status/2024876705253654628

Advertisement
Advertisement