త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ritabrata Banerjee | టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. శివసేన తరహాలో పార్టీ చీలిక తప్పదా?

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీలిక దిశగా వెళ్తోందా? పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేకి 60 మంది రెబల్స్ మద్దతు తెలపడం సంచలనంగా మారింది.

J

National | Published On Jun 3, 2026, 3.32 pm IST

Ritabrata Banerjee | టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. శివసేన తరహాలో పార్టీ చీలిక తప్పదా?
Advertisement
  • పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది
  • పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రిటబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నాయకత్వంలో 60 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారు
  • మమతా బెనర్జీనే తమ అధినేత్రి అని చెబుతూనే.. రిటబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా (LoP) చేయాలని స్పీకర్‌ను కోరారు
  • ఈ పరిణామం అభిషేక్ బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి

Ritabrata Banerjee | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో ముసలం పుట్టింది. శివసేన తరహాలో (Shiv Sena-style split) పార్టీ రెండుగా చీలబోతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ.. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత రిటబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) ఏకంగా 60 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు.

TMC Crisis 60 Rebel MLAs Back Ritabrata Banerjee Split Imminent

అసలేం జరిగింది?

టీఎంసీ ఎమ్మెల్యేలు రిటబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అధిష్టానం మే నెలలో బహిష్కరించింది. అయితే, బుధవారం వీరు 58 మంది టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల (Rebel MLAs) మద్దతుతో ఒక లేఖను సిద్ధం చేశారు. దానికి మరో ఇద్దరు కూడా సంతకాలు చేసే అవకాశం ఉంది.

ఈ లేఖలో మమతా బెనర్జీనే (Mamata Banerjee) తమ నాయకురాలిగా కొనసాగుతారని స్పష్టం చేస్తూనే.. శాసనసభలో ప్రతిపక్ష నేతగా (LoP) రిటబ్రత బెనర్జీని గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మూడింట రెండొంతుల (53) మెజారిటీ ఉంటే పార్టీ ఫిరాయింపు వర్తించదు. ఇప్పుడు రెబల్స్ సంఖ్య 60కి చేరడంతో టీఎంసీ పేరు, గుర్తుపై కూడా వారు హక్కు కోరే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెట్టే ఆలోచన తమకు లేదని రెబల్స్ స్పష్టం చేస్తున్నారు.

అసలు టార్గెట్ అభిషేక్ బెనర్జీనే

ఈ తిరుగుబాటు ప్రధానంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీని ఒక కార్పొరేట్ సంస్థలా నడుపుతున్నారని, I-PAC అనే సంస్థ చేతిలో పార్టీ బందీ అయిపోయిందని రిటబ్రత బెనర్జీ బాహాటంగానే విమర్శించారు. మమతా బెనర్జీ స్థాపించినప్పటి లక్షణాలు ఇప్పుడు పార్టీలో లేవని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మమతా బెనర్జీ తన మేనల్లుడిని సమర్థిస్తారా? లేక మెజారిటీ ఎమ్మెల్యేల వైపు నిలబడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

TMC Crisis 60 Rebel MLAs Back Ritabrata Banerjee Split Imminent

సంతకాల ఫోర్జరీ వివాదం

ఈ వివాదానికి ప్రధాన కారణం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపికే. మే 6న టీఎంసీ అధిష్టానం సీనియర్ నేత శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ పేరును ప్రతిపక్ష నేతగా, చీఫ్ విప్‌గా ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు ఒక డాక్యుమెంట్ ఇచ్చింది. అయితే, అందులో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని లేదా తమ ప్రమేయం లేకుండానే పెట్టారని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదే విషయాన్ని రిటబ్రత, సందీపన్ సాహా స్పీకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. ప్రస్తుతం ఈ 'సైన్‌గేట్' కుంభకోణంపై రాష్ట్ర సీఐడీ (CID) దర్యాప్తు చేస్తోంది.

Advertisement
Advertisement