త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiffany Trump Taj Mahal Visit | తాజ్ మహల్ అందాలకు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు ఫిదా.. పర్యటన విశేషాలివే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ తన భర్తతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించారు. భారీ భద్రత నడుమ జరిగిన ఈ పర్యటన విశేషాలివే.

J

National | Published On May 30, 2026, 4.01 pm IST

Tiffany Trump Taj Mahal Visit | తాజ్ మహల్ అందాలకు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు ఫిదా.. పర్యటన విశేషాలివే
Advertisement

Tiffany Trump Taj Mahal Visit | త్రినేత్ర.న్యూస్ : శనివారం (మే 30, 2026) రోజున ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరం ఆగ్రాకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కుమార్తె టిఫనీ ట్రంప్ (Tiffany Trump), తన భర్త మైఖేల్ బౌలోస్‌తో (Michael Boulos) కలిసి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ను (Taj Mahal) సందర్శించారు. తమ సన్నిహిత మిత్రులతో కలిసి ఆమె ఈ టూర్‌కు వచ్చారు.

అబ్బురపరిచిన ఆర్కిటెక్చర్

ఉదయం 11 గంటల ప్రాంతంలో తాజ్ మహల్ వద్దకు చేరుకున్న ఈ జంట, సుమారు గంటపాటు అక్కడే గడిపారు. 17వ శతాబ్దపు నాటి ఈ అద్భుత పాలరాతి కట్టడం అందాలను ఆస్వాదిస్తూ మురిసిపోయారు. ఈ ప్రాంగణంలోని పలు ప్రదేశాల్లో కలియదిరిగిన వారు.. ఎంతో ఫేమస్ అయిన 'డయానా బెంచ్' (Diana Bench) వద్ద కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చారు.

కేవలం చూడటమే కాకుండా ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ (UNESCO World Heritage Site) చరిత్రను తెలుసుకోవడానికి టిఫనీ ఎంతో ఆసక్తి చూపించారు. మొఘలుల కాలం నాటి విశేషాలు, తాజ్ మహల్ నిర్మాణ శైలి గురించి లోకల్ టూరిస్ట్ గైడ్ రమేష్ దివాన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కట్టడం అద్భుతంగా ఉందంటూ ఆమె ప్రశంసించినట్లు అక్కడి వారు తెలిపారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

అమెరికా అధ్యక్షుడి కుమార్తె పర్యటన కావడంతో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో (Chartered aircraft) ఆగ్రా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వీరు, అక్కడినుంచి రోడ్డు మార్గంలో హోటల్‌కు వెళ్లారు. ఎయిర్‌పోర్టు నుంచి తాజ్ మహల్ వరకు దారిపొడవునా భారీ హై-సెక్యూరిటీ కారిడార్‌ను ఏర్పాటు చేసి అదనపు పోలీసులను మోహరించారు.

తదుపరి పర్యటన ఎక్కడంటే?

భారత్‌లోని పలు నగరాలను సందర్శించేందుకు ప్రైవేట్ టూర్‌కు వచ్చిన ఈ జంట.. శుక్రవారం న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అక్షరధామ్ అద్భుతంగా ఉందని టిఫనీ కొనియాడారు. శనివారం రాత్రి ఆగ్రాలోనే బస చేయనున్న ఈ జంట, ఆ తర్వాత తమ తదుపరి పర్యటన కోసం రాజస్థాన్ (Rajasthan) వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement