త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | ఈ జిల్లాల్లో అతిభారీ వ‌ర్షాలు.. హెచ్చ‌రించిన ఐఎండీ

TG Weather | తెలంగాణ‌లో మూడురోజుల పాటు మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అర్నబ్‌’ బుధవారం ఏపీ, యానాం మ‌ధ్య తీరం దాటింది. బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాంకు నైరుతి దిశలో నర్సాపురం సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 8 గంటలకల్లా తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్త‌య్యింద‌ని తెలిపింది.

P

Telangana | Published On Oct 28, 2026, 4.15 pm IST

TG Weather | ఈ జిల్లాల్లో అతిభారీ వ‌ర్షాలు.. హెచ్చ‌రించిన ఐఎండీ
Advertisement

TG Weather | తెలంగాణ‌లో మూడురోజుల పాటు మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అర్నబ్‌’ బుధవారం ఏపీ, యానాం మ‌ధ్య తీరం దాటింది. బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాంకు నైరుతి దిశలో నర్సాపురం సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 8 గంటలకల్లా తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్త‌య్యింద‌ని తెలిపింది. తుపాను తీరం దాటే స‌మ‌యంలో గంటకు 125–135 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచాయ‌ని, గరిష్టంగా 150 కిలోమీట‌ర్ల వేగంతోనూ ఈదురుగాలులు వీచాయ‌ని.. ప్ర‌స్తుతం తీవ్ర తుపాను కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. రాగ‌ల ఆరు గంట‌ల్లో బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని.. ఆ త‌ర్వాత తీవ్ర వాయుగుండం మారుతుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా వేసింది. త‌ర్వాతి 48గంట‌ల్లో ఉత్త‌ర వాయువ్య దిశ‌గా క‌దులుతూ క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని వివ‌రించింది.

ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో బుధ‌వారం ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హెచ్చ‌రించింది. ఆయా జిల్లాల‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ములుగు, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, గంట‌కు 50-60 కిలోమీట‌ర్ల వేగంతో ఈదుగాలుల‌తో కూడిన వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని వివ‌రించింది. అలాగే, భూపాల‌ప‌ల్లి, ములుగు, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని వివ‌రించింది. గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, ఖ‌మ్మం, కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్‌, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ మెరుపులు, ఈదురుగాలుల‌తోకూడిన వాన‌లు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. శుక్ర‌వారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

 

Advertisement
Advertisement