త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAS Sai Kumar | త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తెలంగాణ వ్య‌క్తి

IAS Sai Kumar | త‌మిళ‌నాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండు వారాలు ఉంద‌న‌గా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితోపాటు (Chief Secretary) రాష్ట్ర డీజీపీని మార్చుతూ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ‌కు చెందిన త‌మిళ‌నాడు క్యాడ‌ర్‌ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి డాక్ట‌ర్ ఎం. సాయికుమార్‌ను (Dr. M Sai Kumar) సీఎస్‌గా నియ‌మించింది.

G

National | Published On Apr 9, 2026, 6.31 am IST

IAS Sai Kumar | త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తెలంగాణ వ్య‌క్తి
Advertisement

IAS Sai Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ‌నాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండు వారాలు ఉంద‌న‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ECI) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితోపాటు (Chief Secretary) రాష్ట్ర డీజీపీని మార్చుతూ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ‌కు (Telangana) చెందిన త‌మిళ‌నాడు క్యాడ‌ర్‌ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి డాక్ట‌ర్ ఎం. సాయికుమార్‌ను (Dr. M Sai Kumar) సీఎస్‌గా నియ‌మించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ ప‌ద‌విలో ఎన్‌.మురుగానందం (N Muruganandam) కొన‌సాగుతున్నారు. అదేవిధంగా డీజీపీ ఎస్‌. దేవ‌సిర్వ‌తం స్థానంలో సీనియ‌ర్ ఐఏఎస్ సందీప్ మిట్ట‌ల్‌కు డీజీపీగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

తమిళనాడు కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సాయికుమార్ (IAS Sai Kumar) రెవెన్యూ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ క‌మిష‌న‌ర్‌గా ప్ర‌త్యేక ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి హోదాలో ప‌నిచేస్తున్నారు. ఆయ‌న 1966, ఆగ‌స్టు 31న తెలంగాణ‌లో జ‌న్మించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశారు. మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్‌ ఎఫైర్స్‌లో పీహెచ్‌డీ ప‌ట్టా పొందారు. సహాయ కలెక్టర్ హోదా నుంచి అంచలంచెలుగా ఎదిగి.. ప్ర‌స్తుతం సీఎస్‌ హోదాకు చేరుకున్నారు. ధర్మపురి కలెక్టర్‌గా, మదురై కార్పొరేషన్‌ కమిషనర్‌గా, తమిళనాడు విద్యుత్‌మండలి చైర్మన్‌, త‌మిళ‌నాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేప‌ర్స్ లిమిటెడ్ సీఎండీ, త‌మిళ‌నాడు ఎల‌క్ట్రిసిటీ బోర్డ్ చీఫ్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో అప్ప‌టి ముఖ్యమంత్రి పళనిసామికి ముఖ్య కార్యదర్శిగా, ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా, 2021లో రెవెన్యూ పరిపాలన కమిషనర్‌గా వ్యవహరించారు. ప‌రిపాల‌నా ద‌క్ష‌కుడిగా పేరొందిన సాయికుమార్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు (సౌర‌భ్‌, శృతి) ఉన్నారు.

Advertisement
Advertisement