Guwahati | షాకింగ్.. అధికారులు రైడ్‌కు వస్తున్నారని.. బాలికను పెట్టెలో కుక్కి
Guwahati | అస్సాం (Assam) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను ఓ మహిళ పెట్టెలో దాచి అధికారుల కళ్లుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
Guwahati | అస్సాం (Assam) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను ఓ మహిళ పెట్టెలో దాచి అధికారుల కళ్లుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, అధికారులు చివరికి బాలికను గుర్తించి రక్షించారు. ఈ ఘటన గువాహటి (Guwahati)లో చోటు చేసుకుంది.
అమ్రిన్ అక్తర్ అనే మహిళ 13 ఏళ్ల బాలికను ఇంట్లో నిర్బంధించింది. ఆ బాలిక గత ఆరేళ్లుగా ఆ ఇంట్లో పని చేస్తోంది. అయితే, బాలికను సదరు మహిళ చిత్రహింసలకు గురి చేస్తూ వస్తోంది. ఈ విషయంపై నివాసితులు అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన జిల్లా లేబర్ టాస్క్ ఫోర్స్ ఒక మేజిస్ట్రేట్ సమక్షంలో ఆ ఇంటికి వెళ్లి బాలిక కోసం వెతకసాగారు. అయితే, అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న మహిళ సదరు బాలికను ఎవరికీ అనుమానం రాకుండా బెడ్ స్టోరేజ్ బాక్స్ (bed storage box)లో దాచిపెట్టింది. దానిపై ఓ బాలుడిని పడుకోపెట్టింది. ఇక ఆ ఇంటికి చేరుకున్న అధికారులు సోదాలు చేపట్టారు. అయితే, ఆ ఇంట్లో బాలిక ఎక్కడా కనిపించలేదు.
బాలికను ఆమె తండ్రి మూడు రోజుల క్రితమే తీసుకెళ్లాడని బుకాయించింది. అయినా ఆమె మాటలను అధికారులు వినిపించుకోలేదు. సోదాలు కొనసాగించారు. చివరికి ఓ బెడ్‌రూమ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. బాలుడు నిద్రిస్తున్నాడని డిస్ట్రబ్ చేయొద్దంటూ ఆమె వారికి అడ్డుపడింది. దీంతో అనుమానం వచ్చి అధికారులు ఆ గదిలోకి వెళ్లి తనిఖీ చేశారు. బాలుడిని లేపి బాక్స్ తెరవగా బాలిక బయటపడింది. దాదాపు 25 నిమిషాల పాటూ ఆ బాలిక ఊపిరాడక పెట్టెలోనే నరకయాతన అనుభవించింది. ఈ మేరకు ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్న మహిళపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మరోవైపు అధికారులు బాలికను రక్షించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలిక పట్ల కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిందంటూ మహిళపై మండిపడుతున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ డీల్స్ రివీల్.. ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..
- ●Revanth Reddy | ఇంటర్నెట్తో మరింత సులభంగా నేరాలు..: సీఎం రేవంత్
- ●Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
- ●Suicide | భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయిన తల్లి.. తర్వాత ఏమైందంటే
- ●TTD Tirupati Darshan | తిరుమల దర్శనం టిక్కెట్లను వేగంగా బుక్ చేసే ట్రిక్.. అసలు కారణం ఇదే..
- ●Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క

Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ డీల్స్ రివీల్.. ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..

Revanth Reddy | ఇంటర్నెట్తో మరింత సులభంగా నేరాలు..: సీఎం రేవంత్

Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు

Suicide | భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయిన తల్లి.. తర్వాత ఏమైందంటే






