త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu | త‌మిళ‌నాడులో మంత్రుల‌కు శాఖ‌లు.. సీఎం విజ‌య్ వ‌ద్దే హోంశాఖ‌..!

Tamil Nadu | త‌మిళ‌నాడులో ఇటీవ‌ల టీవీకే ప్ర‌భుత్వం కొలువుదీరింది. ముఖ్య‌మంత్రిగా విజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే శ‌నివారం లోక్‌భ‌వ‌న్ శ‌నివారం మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించిన‌ట్లుగా ప్ర‌క‌టించింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజ‌య్‌తో పాటు ప‌ది మంత్రుల‌కు శాఖ‌ల‌ను కేటాయించిన‌ట్లు వెల్ల‌డించింది.

P

National | Published On May 16, 2026, 7.31 pm IST

Tamil Nadu | త‌మిళ‌నాడులో మంత్రుల‌కు శాఖ‌లు.. సీఎం విజ‌య్ వ‌ద్దే హోంశాఖ‌..!
Advertisement

Tamil Nadu | త‌మిళ‌నాడులో ఇటీవ‌ల టీవీకే ప్ర‌భుత్వం కొలువుదీరింది. ముఖ్య‌మంత్రిగా విజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే శ‌నివారం లోక్‌భ‌వ‌న్ శ‌నివారం మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించిన‌ట్లుగా ప్ర‌క‌టించింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజ‌య్‌తో పాటు ప‌ది మంత్రుల‌కు శాఖ‌ల‌ను కేటాయించిన‌ట్లు వెల్ల‌డించింది. జాబితా ప్ర‌కారం.. సీఎం విజ‌య్ ప‌లు కీల‌క శాఖ‌ల‌ను త‌న‌వ‌ద్దే ఉంచుకోవ‌డం విశేషం. సీఎం జోసెఫ్ విజయ్ హోం శాఖతో పాటు ప్రత్యేక కార్యక్రమాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, బాలల సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖల బాధ్య‌త‌లు చూసుకోనున్నారు.

మంత్రుల శాఖ‌లు ఇలా..

ఎన్ ఆనంద్ : గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ
ఆదవ్ అరుణ : పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖ
డాక్ట‌ర్ కేజీ అరుణరాజ్ : ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ
కేఏ సెంగొట్టయ్యన్ : ఆర్థిక శాఖ
పీ వెంక‌ట‌రామ‌న్ : పౌర సరఫరాల శాఖ
ఆర్ నిర్మల్‌కుమార్ : ఇంధన వనరులు, న్యాయశాఖ
రాజమోహన్ : పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సమాచారశాఖ‌
డాక్ట‌ర్ టీకే ప్ర‌భు : సహజ వనరుల శాఖ
సెల్వి ఎస్ కీర్తన : పరిశ్రమల శాఖ

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీల మ‌ద్ద‌తుతో విజ‌య్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల ప‌రీక్ష‌ల్లో ప్ర‌భుత్వానికి 140 మందికిపైగా స‌భ్యులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీవీకే నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్‌, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు తెలిపారు. ఇదిలా ఉండగా సీఎం విజ‌య్ మే 22న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లతో స‌మావేశ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement