త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu SIR | త‌మిళ‌నాడులో స‌ర్ తుది జాబితా విడుద‌ల‌.. 74 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ పేర్లు తొల‌గింపు

Tamil Nadu SIR | తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన తుది జాబితాను ఈసీ ఇవాళ విడుద‌ల చేసింది.

D

National | Published On Feb 23, 2026, 4.52 pm IST

Tamil Nadu SIR | త‌మిళ‌నాడులో స‌ర్ తుది జాబితా విడుద‌ల‌.. 74 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ పేర్లు తొల‌గింపు
Advertisement

Tamil Nadu SIR | తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన తుది జాబితాను ఈసీ ఇవాళ విడుద‌ల చేసింది. ఈ జాబితా నుంచి సుమారు 74 ల‌క్ష‌ల ఓట‌ర్ల పేర్లు తొల‌గించడం గ‌మ‌నార్హం. తొలుత ఓటరు జాబితా స‌వ‌ర‌ణ‌కు ముందు సుమారు 6,41,14,587 ఓట‌ర్లు ఉండేవారు. కానీ స‌ర్ త‌ర్వాత మొత్తం ఓట‌ర్ల సంఖ్య 5,43,76,756 కోట్ల‌కు తగ్గింది.

దాదాపు 97లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. ఓటు హక్కు కోల్పోయిన వారు అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ కొంత గడువు కల్పించింది. వారి దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 27.53లక్షల మంది అర్హులైన ఓటర్లను చేర్చింది. 4.23లక్షల మంది అనర్హులను జాబితా నుంచి తొలగించింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5.67 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో 2,77,38,925 మంది పురుష ఓటర్లు కాగా, 2,89,60,838 మంది మహిళా ఓటర్లు, 7,617 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 12.51 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు 18-19 ఏళ్ల మ‌ధ్య ఉన్న యువ ఓట‌ర్లే. 4.63 ల‌క్ష‌ల మంది విక‌లాంగులు, 3.99 ల‌క్ష‌ల మంది 85 ఏళ్లు పైబ‌డిన సీరియ‌ర్ సిటిజ‌న్లు ఉన్నారు.

Advertisement
Advertisement