త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay | డబ్బులు తీసుకోండి.. గ‌ట్టిగా ‘విజిల్‌’ వేయండి : టీవీకే చీఫ్ విజ‌య్‌

Vijay | అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్ర‌భుత్వం మ‌హిళ‌ల అకౌంట్లోకి రూ.5,000 వేసిన విష‌యం తెలిసిందే. దీనిపై టీవీకే చీఫ్ విజ‌య్ (TVK Chief Vijay) స్పందించారు.

D

National | Published On Feb 13, 2026, 4.17 pm IST

Vijay | డబ్బులు తీసుకోండి.. గ‌ట్టిగా ‘విజిల్‌’ వేయండి : టీవీకే చీఫ్ విజ‌య్‌
Advertisement

Vijay | అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్ర‌భుత్వం మ‌హిళ‌ల అకౌంట్లోకి రూ.5,000 వేసిన విష‌యం తెలిసిందే. దీనిపై టీవీకే చీఫ్ విజ‌య్ (TVK Chief Vijay) స్పందించారు. ఈ మేర‌కు డీఎంకే ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సీఎం స్టాలిన్ అధికార దుర్వినియోగానికి, ఆ పార్టీ నేత‌లు అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. ఎన్న‌డూ లేనిది ఇప్పుడు మ‌హిళ‌ల ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

సేలంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో విజ‌య్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా మ‌హిళ‌ల‌కు అందించాల్సిన రూ.1,000 ఆర్థిక సాయాన్ని ఒకేసారి ముంద‌స్తుగా ఇవ్వ‌డంపై విజ‌య్ స్పందించారు. రాష్ట్ర ప్రాయోజిత ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు ముంద‌స్తు చెల్లింపుగా రూ.3,000తోపాటూ అద‌నంగా రూ.2,000 ఇవ్వ‌డంపై ప్ర‌శ్నించారు. సడెన్‌గా సమ్మర్ బొనాంజా పేరిట రూ.2 వేలు అదనంగా ఎందుకిచ్చార‌ని ప్ర‌శ్నించారు.

‘వేసవి ప్రత్యేక ప్యాకేజీ రూ. 2000 అని అకస్మాత్తుగా ఎందుకు ప్రకటించారు..? ఈ సంవత్సరం మాత్రమే వేసవి వస్తుందా..? ఏంటి..? ప్రతి నెలా రూ.15వ తారీఖున పడే డబ్బులు ఈసారి మాత్రం 13వ తేదీనే ఎందుకు ఇచ్చారు..? ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకే డీఎంకే ఆధ్వర్యంలోని స్టాలిన్ ప్రభుత్వం ఈ పని చేసింది. దీనికి కార‌ణం విజిల్ సౌండే. ఇప్పుడు వీధుల్లోనే కాదు, ప్ర‌తీ ఇంట్లోనూ విజిల్ సౌండు వినిపిస్తోంది. విజిల్‌కి భ‌య‌ప‌డిపోయిన ప్ర‌భుత్వం సెడెన్‌గా స‌మ్మ‌ర్ బొనాంజా అంటూ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికీ ఒక విష‌యం మాత్రం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. వారిలో వ‌ణుకు పుట్టించే ఏకైక ప్ర‌జాశ‌క్తి మ‌న‌మే.

ఇదే మ‌న మొద‌టి విజ‌యం. ఇంతటితో అయిపోయిందా..? అంటే లేదు. ప్రభుత్వంతో బ‌లంవంతంగా అయినా మంచి ప‌నులు చేయించ‌గ‌లిగే రాజ‌కీయ శ‌క్తి కూడా మ‌న‌మే అని దీన్ని బ‌ట్టే అర్థ‌మైంది. ఈ ప్ర‌క‌ట‌న‌తో డీఎంకే త‌న అస‌లైన ప్ర‌త్య‌ర్థిగా భావిస్తున్న‌ది కేవ‌లం టీవీకే పార్టీని మాత్ర‌మేన‌ని చెప్ప‌క‌నే చెప్పింది. ఈ విజిల్ వ‌ల్లే మీ హ‌క్కులు మీకు ల‌భిస్తున్నాయి. అది మీ డ‌బ్బే. దాన్ని సంతోషంగా స్వీక‌రించండి. డ‌బ్బు తీసుకున్న త‌ర్వాత‌.. గ‌ట్టిగా విజిల్ వేయండి’ అని విజ‌య్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement