Suvendu Adhikari | బెంగాల్‌లో బీజేపీ నేత సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. అభిషేక్ బెనర్జీ పనేనా?
Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) హత్యా రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యంగ్రామ్ ప్రాంతంలో బీజేపీ అగ్రనేత సువేందు అధికారి (Suvendu Adhikari) వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ (Chandranath Rath) దారుణ హత్యకు గురయ్యాడు.
Suvendu Adhikari | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) హత్యా రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యంగ్రామ్ ప్రాంతంలో బీజేపీ అగ్రనేత సువేందు అధికారి (Suvendu Adhikari) వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ (Chandranath Rath) దారుణ హత్యకు గురయ్యాడు. దోహారియా ప్రాంతంలో రాత్రి చంద్రనాథ్ కారులో ఉండగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు.. డోర్ గ్లాస్ పైనుంచే మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చంద్రనాథ్‌ని స్థానికులు ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే రథ్ మరణించినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెళ్లడించారు. దీంతో బెంగాల్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత టీఎంసీ, కమలం పార్టీ కార్యకర్తలపై వరుగా దాడులు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ఏకంగా జేసీబీలతో టీఎంసీ కార్యాలయాన్ని బీజేపీ జెండాలు ఉన్న వ్యక్తులు కూల్చివేశారు. తాజాగా రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ముందు వరుసలో సువేందు అధికారి పీఏ హత్యకు గురవడం విశేషం. కాగా, విషయం తెలుసుకున్న పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రథ్ హత్య ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సువేందు అధికారి.. మమతా బెనర్జీ అల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. హత్య వెనుక అతని ప్రమేయం ఉందన్నారు. పక్కా ప్లాన్‌తోనే తన పీఏను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎంసీ కూడా రథ్ హత్యను ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేసింది. ఆ హత్యతో తమకు సంబంధం లేదని తెలిపింది. దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హింస జరగడం దురదృష్టకరని తెలిపింది. చంద్రనాథ్ హత్యపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
We strongly condemn the brutal murder of Chandranath Rath in Madhyamgram tonight, along with the killing of three other TMC workers in incidents of post-poll violence allegedly carried out by BJP-backed miscreants over the last three days, despite the Model Code of Conduct being…
— All India Trinamool Congress (@AITCofficial) May 6, 2026
మరోవైపు బెంగాల్‌లో హింస చెలరేగడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వరుసగా దాడులు, హత్యలు జరగడం ఏంటని ప్రశ్నించింది. బెంగాల్ పోలీసు శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు అతుపు తప్పకుండా చూడాలని ఆదేశించింది. ఘటనలపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశాలు జారీచేసింది.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



