MK Stalin | సమ్మర్ స్పెషల్.. మహిళల ఖాతాల్లోకి రూ.5,000
MK Stalin | ఎన్నికలకు ముందు (Tamil Nadu Elections) తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కలైంగర్ (Kalaignar) పథకం కింద మహిళల ఖాతాల్లోకి రూ.5,000 జమ చేసింది.
MK Stalin | మరో రెండు నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న (Tamil Nadu Elections) విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. కలైంగర్ (Kalaignar) పథకం కింద మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.5,000 జమ చేసింది. రాష్ట్రంలోని సుమారు 1.31 కోట్ల మంది మహిళలకు ఈ డబ్బును జమచేసింది. ఈ మొత్తంలో రూ.2,000 సమ్మర్ స్పెషల్ అని సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
కలైంగర్ పథకం కింద మహిళలకు ప్రతి నెలా అందించే రూ.1,000 సాయాన్ని ముందుగానే అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రూ.3,000, మిగతా రూ.2,000 సమ్మర్ స్పెషల్ అని ప్రకటించారు. మొత్తం కలిపి రూ.5,000 మహిళల ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపారు. ఎన్నికల పేరుతో కొందరు ఈ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం ఆరోపించారు. అందుకే ముందుగానే సాయాన్ని బదిలీ చేస్తున్నట్లు వివరించారు. అంతేకాదు, ఈ సందర్భంగా సీఎం మరో కీలక ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తే సహాయ నగదును రూ.2,000కి రెట్టింపు చేస్తామని ప్రకటించారు. మహిళలకు ఆర్థిక మద్దతు, సంక్షేమం, సాధికారత, స్వయం ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశమని వివరించారు. ఈ మొత్తాన్ని పిల్లల విద్య, ఇతర నిత్యావసరాల కొనుగోలుకు ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






